Karthika Deepam 21 Aug Today Episode : కార్తీక దీపం 21 ఆగస్టు 2021, శనివారం ఎపిసోడ్ 1124 తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మీరు నన్ను కేసు నుంచి వదిలేయకున్నా పర్లేదు.. కానీ నన్ను ప్రశ్నించడం వదిలేస్తే చాలు. మీరు నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేనున్న పరిస్థితి వేరు. అప్పటి నా మానసికస్థితి వేరు. నేరం చేయకున్నా నిర్ధోషి.. దోషిగా ఒప్పుకున్నాడంటే… అర్థం చేసుకోండి. నేనేం తప్పు చేయలేదు. మోనితే తప్పు చేసింది. మోనిత చేసిన తప్పులకు నాకు శిక్ష వేస్తున్నారు. ఈ శిక్షలు తనకు వేయాల్సింది.. అంటూ కార్తీక్.. ఏసీపీ రోషిణితో చెబుతారు.
మోనిత నిన్ను ప్రేమించడం తప్పు కాదా? తను గర్భవతి అవ్వడం నిజం కాదా? తనతో 10 ఏళ్ల పాటు తిరగడం నిజం కాదా? మోనిత శవాన్ని ఎక్కడ దాచారో త్వరగా చెప్పేస్తే బాగుంటుంది. మీ వృత్తి మీద గౌరవంతో మీకు ఎటువంటి ఫిజికల్ ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదు.. అని రోషిణి అనగానే.. ఇక నేను వెళ్లొచ్చా మేడమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
కట్ చేస్తే.. అంజి.. దుర్గను కలుస్తాడు. జైలు నుంచి ఎప్పుడు వచ్చావు దుర్గా అని అంజి అడుగుతాడు. మోనిత నిజంగా చనిపోయిందా? మోనితను ఎవరు చంపారు? నిజంగా డాక్టర్ బాబే చంపారా? అనే మాటలు అనుకుంటుండగా… ఇంతలోనే దుర్గ దగ్గరికి దీప వస్తుంది. నిజంగా మోనిత చనిపోయిందా? దీపమ్మా.. అని దుర్గ అడుగుతాడు. అసలు ఏం జరిగింది దీపమ్మ.. అని అడుగుతాడు దుర్గ.
స్టోరీ మొత్తం చెబుతుంది దీప. డాక్టర్ బాబు కాల్చింది పిన్ని చూడలేదు కదా.. అని అడిగితే అవును చూడలేదు.. అని దీప చెబుతుంది. ఈ స్టోరీ అంత విని.. మోనిత చనిపోలేదు.. బతికే ఉంది.. తనను వెతకాలి.. అని దుర్గ అంటాడు. దుర్గ, అంజి.. ఇద్దరం సపోర్ట్ గా ఉంటాం అని దీపకు చెబుతారు.
కట్ చేస్తే.. రత్నసీత.. మోనిత దగ్గరికి వెళ్తుంది. మా అక్కను కాపాడారు.. అన్న ఒకే ఒక్క విషయంపై నేను మీకు అన్ని విషయాలు చెబుతున్నాను. నాకు ఎటువంటి సమస్య రాకుండా చూడండి.. అని చెబుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను నేను చూసుకుంటా. నీ ఉద్యోగం పోయినా నేను మా హాస్పిటల్ లో ఇప్పిస్తా. కార్తీక్ ను కలవడానికి ఇంకా ఎవరైనా వచ్చారా? అని అడుగుతుంది మోనిత. లేదు మేడమ్..కానీ.. ఏసీపీ మేడమ్ ఇంటరాగేషన్ చేశారు.. అని చెబుతుంది.
కట్ చేస్తే.. పిల్లలకు భోజనం వడ్డిస్తుంటుంది దీప. అమ్మా దీప.. అంటూ తన తండ్రి, భాగ్య వస్తారు. నువ్వు మళ్లీ మీ అత్తగారింట్లో వచ్చావని సంతోషపడాలా? లేక నీ భర్త దూరమయ్యారని బాధపడాలా? అనేది అర్థం కావడం లేదమ్మా.. అంటూ చెప్పి బాధపడతారు. మేము గుడికి వెళ్లాం.. అక్కడ సోది చెప్పే మహిళ.. బస్తీలోని గుడికి రమ్మని చెప్పింది.. అని చెబుతారు. తప్పకుండా వెళ్లు.. అని చెప్పడంతో.. సరే నాన్న.. వెళ్తాను.. అని చెబుతుంది.
కట్ చేస్తే.. ఏసీపీ రోషిణి ఇంటికి సౌందర్య వెళ్తుంది. ఏంటి.. ఈసారి ఏం తెచ్చారు.. సౌందర్య.. అని అడుగుతారు రోషిణి. ఈ టైమ్ లో ఎందుకు వచ్చారు. మంచితనం లాకప్ లో ఉంది.. అంటుంది. నిన్నటి దాకా వేదాంత ధోరణిలో మాట్లాడిన మీ అబ్బాయి.. ఇవాళ నేను ఈ హత్య చేయలేదు అని చెబుతున్నాడు.. అని ఏసీపీ చెప్పగానే.. షాక్ అవుతుంది సౌందర్య. మా అబ్బాయి అలా చెప్పాడంటే.. వాడు ఖచ్చితంగా ఈ హత్య చేసి ఉండడు.. అని చెబుతుంది సౌందర్య. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు.. వాళ్ల ఇంట్లో దొరికిన బుల్లెట్స్.. వీటికి ఎవరు సమాధానం చెబుతారు.. అని ఏసీపీ అంటుంది.
నేరం చేసినవాళ్లు.. వెంటనే స్టేషన్ కు వచ్చి లొంగిపోతారు. దానికి కారణం… వాళ్లు తప్పు చేశారని తెలుసుకోవడం. కానీ.. నీ సుపుత్రుడు మాత్రం తప్పు మీద తప్పు చేసి ఇప్పుడు హత్య చేయలేదు.. అని అంటున్నారా? అని ఏసీపీ చెప్పేసరికి.. మీకు పెళ్లయి పిల్లలు ఉంటే.. అప్పుడు మీకు మాతృత్వం రుచి తెలిసి ఉండేది. మీరు నిజంగా కార్తీకే తప్పు చేశాడు.. అని భావిస్తే.. కార్తీక్ దోషి అని రుజువు చేయండి. అప్పుడు మేం కూడా కార్తీక్ తప్పు చేశాడని ఒప్పుకుంటాం. వాడికి ఏ శిక్ష వేసినా మేం భరిస్తాం.. అని చెబుతుంది సౌందర్య.
మీ లైసెన్స్ రివాల్వర్ నుంచి రెండు బుల్లెట్స్ మిస్ అయ్యాయి. రెండింట్లో నుంచి ఒకటి మా రికార్డ్స్ లో ఉంది. ఇంకొకటి ఏమైంది. దానికి కూడా లెక్క చెప్పండి. మీకు ఒక్క రోజు సమయం ఇస్తున్నాను. దాని లెక్క చెప్పడానికి మీకు ఒక్క రోజు టైమ్ ఇస్తున్నాను. ఆ బుల్లెట్ లెక్క చెప్పకపోతే.. మీరు కూడా స్టేషన్ కు రావాల్సి వస్తుంది. మాతృత్వం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.. అని హెచ్చరిస్తుంది రోషిణి.
కట్ చేస్తే.. ఉదయమే దీప గుడికి వెళ్తుంది. పూజారి అఖండ దీపం కోసం అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాడు. అఖండ దీపం వెలిగించడం కోసం దీప.. పూజ కోసం కూర్చుంటుంది. నా సమస్యకు ఒక పరిష్కారం దొరికితే చాలు.. అని దీప అంటుంది. ఇంతలోనే ఉదయమే మళ్లీ సోది చెప్పేదానిలా రెడీ అయిన మోనిత.. గన్ పట్టుకొని గుడికి వెళ్తుంది. నీ సమస్యకు పరిష్కారం ఈ లోకం నుంచే బహిష్కారం.. అంటూ తనకు గన్ గురిపెడుతుంది మోనిత.
నీ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుందమ్మా.. అని పూజారి అంటాడు. ఈలోకంలో కార్తీక్ జైలుకు వెళ్లకుండా.. కాపాడగలిగే ఒకే ఒక్క ప్రాణి మోనిత.. అంటూ మోనిత తనలో తాను అనుకుంటుంది. నువ్వు పైకి వెళ్తే నేను బయటికి వస్తాను.. అని అంటుంది. దీప పైకి లేచి.. హోమం చుట్టూ అడుగులు వేస్తుండగానే.. మోనిత.. గన్ తో దీపను షూట్ చేస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.