Karthika Deepam 24 Aug Today Episode : మోనిత బతికే ఉందని దీపకు తెలిసిపోయింది.. పోలీస్ స్టేషన్ లోనూ మారువేషంలో వచ్చిన మోనితను గుర్తుపట్టిన డాక్టర్ బాబు.. ఇక కార్తీక్ రిలీజ్ అవుతాడా?

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Karthika Deepam 24 Aug Today Episode : కార్తీక దీపం 24 ఆగస్టు 2021, మంగళవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 1126 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడిలో అఖండ దీపం వెలిగిస్తుండగా.. మోనిత.. దీపను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. చేతిలో గన్ పట్టుకొని.. దీపకు గురి పెట్టి.. షూట్ చేద్దామని అనుకునే లోపే తనకు పూజారి అడ్డం వస్తాడు. భక్తులు అటూ ఇటూ వెళ్తుంటే.. తను కాల్చలేకపోతుంది. నీ మృత్యువును వెతుక్కుంటూ నువ్వే వస్తావు.. అప్పుడు తొందరెందుకు.. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి.. నేనెవరో చెప్పి అప్పుడు కాలుస్తా.. అని చెప్పి.. మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

కట్ చేస్తే.. టిఫిన్ చేయండి అని ఆదిత్య భార్య.. శౌర్య, హిమను అడుగుతుంది. అమ్మ వచ్చాక తింటాం.. అని చెబుతారు పిల్లలు. అసలు.. అమ్మ ఎక్కడికి వెళ్లింది. మాకు భయం వేస్తోంది. ఎప్పుడు వస్తుంది. నాన్నను పోలీసులు తీసుకెళ్లారు. అమ్మకు ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నాం.. అని ఆదిత్య భార్యకు చెబుతారు పిల్లలు. మీరేం టెన్షన్ పడకండి.. బాబాయి.. జాగింగ్ కు వెళ్లి రాగానే చెబుతా. అమ్మ ఎక్కడికి వెళ్లిందో కనుక్కొమ్మని చెబుతాను.. అంటుంది ఆదిత్య భార్య. ఏడవకండి.. కూర్చోండి.. తినండి.. అంటే టిఫిన్ తినకుండానే వెళ్తారు.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Karthika Deepam 24 Aug Today Episode : సోది చెప్పే మహిళ కోసం వెతికిన దీప

కట్ చేస్తే.. దీప అటూ ఇటూ వెతుకుతుంటుంది. సోది చెప్పే వ్యక్తి కోసం చూస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను.. అంటూ మోనిత ఏదో సోది చెబుతుంటే విని అక్కడికి వెళ్తుంది. రా తల్లి రా.. మారు తల్లి ఒక్కసారి వచ్చి పోయింది. తండ్రి కూడా వచ్చి పోయిండు. అంతేనా తల్లి. రా కూకో తల్లి. నీ ఐదో తనం సల్లగా ఉండాలని నీ పుస్తెలకు బొట్టు ఎట్టుకో తల్లి.. అంటుంది మోనిత.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

ఇక నీ కట్టాలన్నీ తీరేను. బాధలన్నీ పోయేను. బెజవాడ దుర్గమ్మ.. అలివేలు మంగమ్మ.. కంచి కామాక్షమ్మ.. మధుర మీనాక్షమ్మ.. కాశీ విశాలక్షమ్మ.. పలుకమ్మ.. పలుకు.. అంటూ ఏదేదో మాట్లాడి.. తన చేయిని తీసుకొని… నీకు అర్ధయాష్షు నేనే రాస్తున్న దీప అని మనసులో అనుకుంటుంది. ఏమి రాత బిడ్డ.. అన్నీ కష్టాలే.. కన్నీళ్లే అంటుంది మోనిత. దుర్గమ్మ దగ్గరికి వెళ్లే.. కారులో కాకుండా.. కాలినడకన వెళ్లు.. అంటుంది. కళ్లు మూసుకొని దుర్గమ్మను తలుచుకో.. నేను తెరవమనే దాకా కళ్లు తెరవకు.. అని చెప్పి.. లోపల నుంచి గన్ తీస్తుంది మోనిత.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Karthika Deepam 24 Aug Today Episode : దీపను కళ్లు మూసుకోమని చెప్పి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ గురి పెట్టిన మోనిత

Karthika Deepam 24 Aug Today Episode  వెంటనే తనకు గన్ గురి పెడుతుంది. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తనకు గన్ గురి పెట్టి కాల్చబోతుంది. కానీ.. ఇంతలోనే మోనితకు తుమ్ము వస్తుంది. యాచ్.. అని చెప్పి ఎక్స్ క్యూజ్ మీ అంటుంది. దీంతో తన ముసుగు తొలిగిపోతుంది. వెంటనే దీప తనను చూస్తుంది. గన్ కూడా చూస్తుంది. వెంటనే గన్ బుట్టలో పెట్టుకొని అక్కడి నుంచి మోనిత పారిపోతుంది. తను సోదమ్మ కాదు.. మోనిత అని గమనించిన దీప.. తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే దుర్గ, అంజి అక్కడికి వస్తారు. దీపమ్మ ఏమైంది.. అని అడిగితే.. మోనిత వచ్చింది.. నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది. సోదమ్మలా వచ్చింది. నేను గన్ కూడా చూశా.. అని అంటుంది దీప.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Karthika Deepam 24 Aug Today Episode : మోనితను చూసిన విషయం దుర్గ, అంజికి చెప్పిన దీప

Karthika Deepam 24 Aug Today Episode  అయ్యో.. దీపమ్మ.. మోనిత ఇక్కడికి ఎందుకు వస్తుంది. అది కూడా సోదమ్మలా ఎందుకు వస్తుంది.. అని అడుగుతాడు దుర్గ. అది నిన్ను చూసే పారిపోయింది దుర్గ. లేకపోతే నాకు దొరికిపోయేది.. అని అంటుంది. ముందు నువ్వు కారులో ఇంటికి వెళ్లు దీపమ్మా.. మేం వెతుకుతాం.. అని అంటారు.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

కట్ చేస్తే.. సౌందర్య, తన భర్త, కుటుంబ సభ్యులు అంతా టెన్షన్ పడుతుంటారు. భాగ్య, తన భర్త కూడా అక్కడికి వస్తారు. పూజ చేయించుకుంటే ఓకే కానీ.. సోదమ్మ మాటలను నమ్మడం ఏంటి? అని అంటాడు ఆదిత్య. నాకు అర్థం అయింది. దానికి కారణం నాకు తెలుసు.. అంటుంది సౌందర్య.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

దానికి కారణం దీప మానసిక స్థితి. తుపానులో చిక్కుకున్న మనిషికి గడ్డిపోచే ఆధారం. ఈ సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుందేమోనని వెళ్లింది.. అని అంటుంది. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా అని భాగ్య అంటుంది. ఇంతలోనే దీప.. పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అత్తయ్య దారి దొరికింది.. అంటుంది. డాక్టర్ బాబు ఈ హత్య చేయలేదు అంటుంది దీప. అసలేం జరిగింది.. అంటుంది. హత్య చేయకపోతే మోని ఏమైంది అని అడిగితే.. మోనిత బతికే ఉంది.. అని అంటుంది.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Karthika Deepam 24 Aug Today Episode : మోనిత గురించి కుటుంబ సభ్యులకు చెప్పిన దీప

Karthika Deepam 24 Aug Today Episode  నేనే కళ్లారా చూశాను.. మీరు చూసిన సోదమ్మ ఎవరో కాదు.. ఆ మోనితే. అని అనేసరికి.. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మోనిత ఏంటి.. సోదమ్మ ఏంటి.. అసలేం జరిగింది.. అని అడుగుతాడు సౌందర్య భర్త. నేను గుడికి వెళ్లి అఖండ దీపం వెలిగించాను. ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం చెప్పేసింది దీప.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

అయితే.. తన మాట ఎవ్వరూ నమ్మరు. మోనిత సోదమ్మలా రావడం ఏంటి.. దీప అసలు ఏం మాట్లాడుతోంది అని అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మా దీప.. నిన్న, నేను మీ పిన్ని ఆవిడతో 10 నిమిషాలు మాట్లాడాం. ఆవిడలో మాకు కనపడని మోనిత నీకు ఎలా కనిపించింది. విన్నావా.. మీ పిన్ని, మీ నాన్న చూసినప్పుడు వాళ్లకు అనుమానం రాలేదంటే.. ఆవిడ మోనిత కాదన్నట్టే కదా.. అని సౌందర్య అంటుంది. అవును.. నేను గుర్తుపట్టలేనా? అని పిన్ని కూడా అంటుంది.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

నువ్వు ఉన్న మానసిక పరిస్థితి వల్ల.. మోనిత ఉన్నట్టు అనిపించింది.. అని అందరూ అంటారు. దీప ఏమైపోతున్నావే నువ్వు.. వాడిని విడిపించాన్న ఆశతో.. లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. వాడు ఈ హత్య చేశాడా లేదా? అనేది పక్కన పెడితే.. చనిపోయిన మోనిత బతడకం ఏంటి? సోదమ్మను కలిస్తే ఒక దారి దొరుకుతుందని నువ్వు నమ్మడమే నాకు బాధగా ఉంది.. దేవుడిని అయినా నమ్ముకో కనీసం.. మనసు ప్రశాంతంగా ఉంటుంది.. అని సౌందర్య చెబుతుంది.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Karthika Deepam 24 Aug Today Episode  అక్కా.. పిల్లలు లేచిన దగ్గర్నుంచి.. నువ్వు చెప్పకుండా వెళ్లినందుకు బాధపడుతున్నారు.. భయపడుతున్నారు. ముందు వెళ్లి వాళ్లకు కనిపించు అక్క.. అని అంటుంది ఆదిత్య భార్య. తను మోనిత కాదా? ఇదంతా భ్రమా… దుర్గా నమ్మలేదు.. అంజి నమ్మలేదు. ఇక్కడా ఎవ్వరూ నమ్మలేదు.. నాకు బతికున్నట్టే అనిపించింది మరి.. నిజంగా నా మానసిక పరిస్థితి బాగా లేదా? ఏంటి ఇదంతా? చూసిన నాకన్నా.. చూడని వీళ్లే కరెక్టా.. అని అనుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్తుంది. చూశారా.. దానికి అదే మాట్లాడుకుంటూ వెళ్తుంది.. అని అనే సరికి.. అందరూ తనవైపు చూస్తారు.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Karthika Deepam 24 Aug Today Episode : పోలీస్ స్టేషన్ లో కార్తీక్ కు అసలు విషయం చెప్పిన దీప

Karthika Deepam 24 Aug Today Episode  కట్ చేస్తే.. దీప.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. డాక్టర్ బాబుకు జరిగిందంతా చెబుతుంది. నాకు మోనిత కనిపించింది.. అని చెబుతుంది. కానీ.. కార్తీక్ కూడా నమ్మడు. మోనితేంటి.. మారు వేషంలో రావడం ఏంటి? నువ్వు 24 గంటలు నన్ను విడిపించాలనే ధ్యాసలో పడి ఏమైపోతున్నావు దీప.. అని అంటాడు కార్తీక్. లేదు డాక్టర్ బాబు.. ఇవాళ మోనిత రివాల్వర్ తో వచ్చింది.. అని అంటుంది. దాన్ని వెంటాడి.. వేటాడి.. వెతికి పట్టుకొని.. మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను.. అని శపథం చేస్తుంది దీప. నువ్వు ఇంకా ఇటువంటి సాహసాలు చేయకు అంటాడు కార్తీక్. ఇంతలో పోలీస్ స్టేషన్ కు మరో వేషంలో కార్తీక్ ను చూడటానికి వస్తుంది మోనిత. చాయ్ అమ్మే వ్యక్తిలా వచ్చి.. కార్తీక్ కు చాయ్ ఇస్తూ తన చేయిని తడుముతుంది. దీంతో ఆ స్పర్శ మోనితదే అని గ్రహిస్తాడు కార్తీక్. ఇంతలోనే వెనక్కి తిరిగి వెళ్తూ.. అబ్బా.. అని అంటుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మోనితను గుర్తుపడతారా? అనేది తెలియాలంటే బుధవారం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.

karthika deepam 24 august 2021 tuesday 1126 full episode

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago