
Chiranjeevi: టాలీవుడ్‌లో ప్రస్తుతం మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు నిర్వహించే విషయంలో వివాదాలు, విబేధాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి రక రకాల వాదనలు మా సభ్యులు వినిపిస్తున్నారు. పోటీ చేస్తున్న వారు, వారికి సపోర్ట్ చేసే వారు తోచిన విధంగా తమ గొంతు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి – బాలకృష్ణల మధ్య పొంతన కుదరడం లేదు. చాలా కాలం నుంచి సమయం వచ్చినప్పుడల్లా బాలయ్య మెగా ఫ్యామిలీ, చిరంజీవి మీద వేసే పరోక్ష కామెంట్లు విసురుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
chiranjeevi is not wished on his birthday by balayya and mohan babu
కాగా ఈ సారి మా ఎన్నికలు వ్యవహారం మీద బాలయ్య ఇప్పటికే స్పందించి ఆయన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సమయంలో చిరంజీవి మీద పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇక మంచు ఫ్యామిలీ చిరంజీవితో ఎంతో సన్నిహితంగా ఉంటారు. మోహన్ బాబు, చిరంజీవిల స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల వీరిద్దరు ఓ పర్సనల్ ట్రిప్ కూడా వేసి వచ్చారు. అయితే మా ఎన్నిక వివాదం మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది.
మా బరిలోకి మంచు విష్ణు దిగడంతోనే అసలు సమస్య మొదలైందనేది పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ప్రకాష్ రాజ్‌కు మెగా మద్దతు గట్టిగా ఉంది. ఈ క్రమంలో మంచు, మెగా ఫ్యామిలీల మధ్య చిన్నపాటి మనస్పర్దలు వచ్చినట్టు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా దాదాపు ఇండస్ట్రీలోని అందరూ విషెస్ తెలిపారు. వీరిలో మంచు మనోజ్, మంచు లక్ష్మీ, ఎన్టీఆర్‌లు కూడా ఉన్నారు. కానీ బాలయ్య, కళ్యాణ్ రామ్ స్పందించలేదు. అలాగే మంచు విష్ణు, మోహన్ బాబు కూడా విషెస్ చెప్పనట్టే తెలుస్తోంది. దీనికి కారణం ‘మా’ ఎలక్షన్సేనా..? అని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ అందరికీ తెలిసేలా కాకుండా ఫోన్ ద్వారా చిరుకి వీరు విష్ చేసి ఉండొచ్చు కదా అనే మరో వైపు నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.