Karthika Deepam Today Episode : కార్తీక్, మోనిత పెళ్లికి అడ్డంకి.. పెళ్లి ఆపాలంటూ రిజిస్ట్రార్ ఆఫీసులో అంజి ఫిర్యాదు
Karthika Deepam Today Episode : కార్తీక దీపం 29 జులై 2021, ఎపిసోడ్ 1104 హైలెట్స్ ఇవే. మోనితకు ఎందుకింత పిచ్చి పట్టింది.. అంటూ దీప పిన్ని భయపడుతుంది. దీని పీడ ఎలా విరగడ అవ్వాలి. ఆ అంజి గాడు దొరికినా బాగుండు. ఈ మోనిత అంటేనే నాకు తెగ భయం వేస్తోంది. నేనే దాన్ని తొక్కి చంపి అయినా జైలుకు వెళ్తా అంటూ.. రాత్రి పడుకునే ముందు దీపకు భరోసా ఇస్తుంది తన పిన్ని భాగ్య. ఆ తర్వాత ఇద్దరూ నిద్రపోతారు.
ఉదయం లేవగానే పిల్లలు చూసేసరికి.. దీప రెడీ అవుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అమ్మ.. ఇంత ఉదయమే రెడీ అవుతున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా? అంటూ పిల్లలు ఇద్దరూ అడుగుతారు. అవును.. బయటికి వెళ్తున్నా అని అంటుంది దీప. ఈరోజు తాతయ్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. నానమ్మ లేదు కదా. టైమ్ కు తాతయ్యకు మెడిసిన్ ఇవ్వాలి. అందుకే వెళ్తున్నా.. అంటే మాకు బోర్ కొడుతోంది. నువ్వు మా దగ్గర అస్సలు ఉండటం లేదు. మాతో టైమ్ స్పెండ్ చేయడం లేదు. డాడీ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నువ్వు కూడా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. తాతయ్య దగ్గరికి మేము కూడా వస్తాం. దీపు గాడితో ఆడుకుంటాం. మమ్మల్ని కూడా తీసుకెళ్లు ప్లీజ్ అమ్మ.. అంటూ దీపను వేడుకుంటారు పిల్లలు.
అది కాదమ్మా.. తాతయ్య ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. ఆయన్ను డిస్టర్బ్ చేయకూడదు. వద్దమ్మా మీరు రాకూడదు.. అని వాళ్లను రాకుండా చేసేందుకు పార్క్ కు వెళ్లండి.. అంటూ చెబుతుంది దీప. దీంతో పిల్లలు కూడా సంతోషంగా ఓకే చెబుతారు. అలా పిల్లలకు సర్ది చెప్పి దీప.. ఆసుపత్రికి బయలు దేరుతుంది.
Karthika Deepam Today Episode : కార్తీక్ తో మోనిత పెళ్లికి అడ్డంకులు
కట్ చేస్తే.. మోనిత కు రిజిస్టర్ ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది. 25 వ తారీఖున మీ పెళ్లి జరగకూడదంటూ అంజి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడంటూ.. రిజిస్ట్రార్ మోనిత కు ఫోన్ చేసి చెబుతాడు. దీంతో షాక్ అవుతుంది మోనిత. మేడం మీరు అతడిని ఒప్పిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే పెళ్లి ఆగిపోతుంది. త్వరగా ఏ విషయం అయింది ముందే చెప్పండి మేడం.. అంటూ ఆయన ఫోన్ పెట్టేయడంతో.. ఇదంతా దీప చేసిన పనే అని ఊహిస్తుంది మోనిత. ఎలాగైనా అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాల్సిందే. మోనిత ఓడిపోకూడదు. ఓడిపోయే ప్రసక్తే లేదు.. అంటూ మోనిత తనలో తాను మాట్లాడుకుంటుంది. దీపను ఎలాగైనా ఆపాలి? నేను అనుకున్నది సాధిస్తాను. దీప చేసిన పనికి నా ఒళ్లు మండిపోతుంది. అంటూ తనలో తానే తెగ మధనపడిపోతుంది మోనిత.
ఆ తర్వాత కార్తీక్ తండ్రి డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. నువ్వు ఇవన్నీ ఎలా మరిచిపోయావమ్మా. నీముందు తలెత్తుకోలేకపోతున్నాం.. అని ఆయన అనగానే.. అదేం లేదు మామయ్య.. మీరు అలా మాట్లాడకండి అంటే. లేదమ్మా.. నా కొడుకు వల్ల నువ్వు చాలా బాధలు పడుతున్నావు. నాకొడుకు చేసిన పని నీచపు పని. నేను నీకు క్షమాపణలు అడుగుతున్నాను.. అంటే వద్దు మామయ్య మీరు అలా అనకూడదు. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? మాకు గ్రహణం పట్టింది.. అని అనగానే.. అంతా మోనితదే తప్పా.. వీడిది ఏం లేదా? ఇందులో ఎక్కువ తప్పు వీడిదే. వాడిని అస్సలు వెనకేసుకురాకు. వాడు నా కొడుకే కాదు. ఇంతకాలం నాకు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు కానీ.. ఇప్పుడు ఒక్కడే కొడుకు.. ఇద్దరు కూతుళ్లు. వాడి మొహం కూడా నేను చూడను. నాకు చూడాలని అనిపించడం లేదు.. అనగానే ఆయన ఎప్పటికీ మీ వంశోద్ధారకుడే మామయ్య అంటూ దీప అంటుంది.
డాక్టర్ బాబు నన్ను అనుమానించినప్పుడు మీరంతా నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తప్పు లేనప్పుడు మనం అనుమానిస్తే ఆయన ఏమైపోతారు మామయ్య. నా భర్తకు కనీసం నేనైనా అండగా నిలబడాలి. డాక్టర్ బాబు కళ్లలో నిజాయితీ ఉంది. ఆయన తెలిసి తప్పు చేయలేదు. ఆయన స్థాయి అది కాదు మామయ్య.. అంటూ దీప చెబుతుంది.