Home » Entertainment » Karthika Deepam 5 August 2021 Episode 1110 Highlights
Entertainment

Karthika Deepam Today Episode : హిమను చంపించింది మోనితే.. నన్ను కూడా చంపాలని ఇక్కడ బంధించింది..కార్తీక్ కు నిజాలు చెప్పిన అంజి

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: August 5, 2021, 9:21 am
Advertisement

Karthika Deepam Today Episode : కార్తీక దీపం 5 ఆగస్టు 2021, గురువారం ఎపిసోడ్ 1110 తాజాగా రిలీజ్ అయింది. అంజితో హోటల్ లో మోనిత గొడవ పెట్టుకోవడం చూసి మొత్తం ఫోన్ లో రికార్డు చేస్తుంది దీప. వంటలక్క మీకేం ఇచ్చింది. ఆమె మీద మీకు ఇందుకు ఇంత విశ్వాసం. నేను ఎంతో డబ్బు ఇస్తే.. అదంతా వదిలేసి.. దీపమ్మా.. దీపమ్మా.. అంటూ దాని వెనుక పడతారేంట్రా. నీకు నిజంగా దీప మీద ప్రేమ ఉంటే.. దాని మొగుడు తనను వదిలేసినప్పుడు ఏం పీకారు. నీకు నిజంగా దీప మీద అంత అభిమానం ఉంటే.. కార్తీక్ కాలర్ పట్టుకొని.. హిమను చంపింది నేనేరా.. అని ఎందుకు చెప్పలేకపోయావు. మంచి పేరు తెచ్చుకొని ఏం ఉద్దరిస్తావు. నీ బతుకుకి నువ్వు చేసిన పని ఒక్కటే. ఒకే కారులో ఉన్నా నా కార్తీక్ కు ఏం కాకుండా.. హిమ మాత్రమే చచ్చేలా చేశావు. అదొక్కటే నువ్వు చేసిన ఫేవర్ నాకు. అయినా చంపించిన నేనెంత నేరస్తురాలినో.. చంపిన నువ్వు కూడా నేరస్తుడివే. నువ్వు ఎంత క్రూరమో నేనూ అంతే. కాబట్టి మనం మనం గొడవ పడటం అనవసరం. నాతో వస్తావా? రావా? రేపు నాపెళ్లి. నడు.. అంటూ అంజిని బెదిరిస్తుంది మోనిత.

Advertisement

Karthika Deepam 5 august 2021 episode 1110 highlights

ఇప్పుడు జుట్టు అందిందా? ఇందాక కాళ్లు పట్టుకున్నావు. నువ్వు ఎన్ని చెప్పినా.. నేను నమ్మను. నీతో నేను రావడం ఏంటి? నిన్ను ఇప్పుడు లాక్కెళ్లి డాక్టర్ బాబు, దీపమ్మ కాళ్ల మీద పడేస్తాను.. నడవవే.. అంటూ అంజి… మోనితను లాగబోయేసరికి.. తన దగ్గర ఉన్న గన్ తీసి వెంటనే అంజికి గురి పెడుతుంది. దీపమ్మా దీపమ్మా అంటావు కదా. దీపమ్మ కోసం చచ్చిపో. నా పెళ్లికి నిన్ను అడ్డుగా పెడుతోంది దీప. అందుకే నిన్ను ఏరిపారేయాలని నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నా పెళ్లి ముందు నిన్ను చంపితే నా పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని ఆగా. కానీ.. నువ్వు ఎదురు తిరిగితే ఇక నేను ఆగను.. అంటూ మోనిత చెబుతుంది.

Advertisement

Karthika Deepam Today Episode : అంజిని తాళ్లతో కట్టిపడేసిన మోనిత

ద్రాక్షారామాన్ని పిలిచి.. అంజిని తాళ్లతో కట్టేసి.. తీసుకెళ్లి కారు డిక్కీలో వేయిస్తుంది మోనిత. వాళ్లు బయటికి వచ్చేది చూసి.. దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. డాక్టర్ బాబు.. దీప కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎవ్వరిని అడిగినా తమకు తెలియని చెబుతుంటారు. ఇంతలో వారణాసిని పిలిచి.. దీప ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు. తనకు తెలియదని చెబుతాడు. వెంకటేశ్ ను కారు తీసుకొని రమ్మని చెప్పిందని అంటాడు. దీంతో వెంకటేశ్ నెంబర్ ను తీసుకొని కాల్ చేసి తను ఎక్కడుందో కనుక్కోమని చెబుతాడు డాక్టర్ బాబు. కానీ.. వెంకటేశ్ నెంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో ఇక నువ్వు వెళ్లు.. అని డాక్టర్ బాబు.. వారణాసితో చెబుతాడు.

దీప వెంటనే అక్కడి నుంచి కారులో బయలు దేరుతుంది. వెంకటేశ్ ఫోన్ ఇవ్వు.. డాక్టర్ బాబుకు ఫోన్ చేయాలి అనగానే.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటాడు. దీంతో సరే.. త్వరగా ఇంటికి పోనివ్వు అని అంటుంది దీప. కట్ చేస్తే.. మోనిత ఇంటికి వచ్చేస్తుంది. అయితే.. ఇంటికి రాగానే.. కార్తీక్ వచ్చి వెళ్లాడని ప్రియమణి చెప్పగానే.. మోనిత షాక్ అవుతుంది. అసలు.. కార్తీక్ ఎందుకు వచ్చాడు? నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? అంటూ టెన్షన్ పడుతుంది మోనిత.

Advertisement

Karthika Deepam 5 august 2021 episode 1110 highlights

కట్ చేస్తే.. డాక్టర్ బాబు నిద్రలేస్తాడు. ఉదయం అవుతుంది. చూస్తే తారీఖు 25. తన పెళ్లి ఈరోజే. ఓవైపు మోనిత లేదు. దీప లేదు. అసలు ఏం జరుగుతోందని తెగ టెన్షన్ పడతాడు డాక్టర్ బాబు. పిల్లలు లేచే టైమ్ కి వస్తానని చెప్పింది కదా. వచ్చి పడుకుందా? అని వెళ్లి బెడ్ రూమ్ లో చెక్ చేస్తాడు డాక్టర్ బాబు. చూసేసరికి.. అప్పుడే దీప ఇంటికి వచ్చేస్తుంది. దీపను చూసి తెగ కంగారు పడతాడు డాక్టర్ బాబు. ఎందుకు ఇలా నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తున్నావు అంటూ దీప మీద అరుస్తాడు డాక్టర్ బాబు. అన్నీ స్నానం చేశాక మాట్లాడుకుందాం అని చెప్పి దీప ఇంట్లోకి వెళ్లిపోతుంది.

Karthika Deepam 5 august 2021 episode 1110 highlights

కట్ చేస్తే.. భాగ్య.. మోనిత ఇంటికి వెళ్తుంది. మోనితను ఎలాగైనా ట్రాప్ చేయాలని… భాగ్య.. మోనితకు అబద్ధాలు చెబుతుంది. కార్తీక్ నిన్ను చంపాలని చెప్పి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఆ కార్తీక్ నిన్ను చంపేస్తాడు. ఆ అంజి గాడి పనే అది. వాడు నిన్న రాత్రి డాక్టర్ బాబును కలిసి మొత్తం చెప్పేశాడట. అందుకే డాక్టర్ బాబు నిన్ను చంపాలని అనుకుంటున్నాడట.. అంటూ ఏవేవో కథలు చెబుతుంది భాగ్య. అయితే.. తన పెళ్లి ఆపడానికి భాగ్యం వేసిన ప్లాన్ అర్థం చేసుకున్న మోనిత.. రివర్స్ లో భాగ్యకు కౌంటర్ ఇస్తుంది. నిజంగా మీరు చాలా గ్రేట్. నా ప్రాణాలు కాపాడటం కోసం ఇంత సాహసం చేస్తున్నారా? అంటూనే.. బట్టలు సర్దుకొని వస్తా అని చెప్పి.. గదిలోకి తీసుకెళ్లి.. డాక్టర్ బాబు నన్ను అర్థం చేసుకోవడం లేదు.. అందుకే నేను చావాలనుకుంటున్నాను.. అంటూ కొత్త కథ చెబుతుంది మోనిత.

Advertisement

అసలేం జరిగింది.. ఇప్పుడైనా చెప్పు అంటూ డాక్టర్ బాబు.. దీపను అడగడంతో.. ఒక ప్లేస్ కు వెళ్లండి అని చెబుతుంది. అక్కడికి వెళ్లి చూడగానే అంజి కనిపిస్తాడు. దీపమ్మ పంపించిందా? అని అడిగి.. డాక్టర్ బాబుకు మొత్తం విషయం చెప్పేస్తాడు. హిమను చంపించింది.. నన్ను బంధించింది.. మోనితే అని అసలు నిజాలు డాక్టర్ బాబుకు చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Karthika Deepam 5 august 2021 episode 1110 highlights

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి