
karthika deepam 7 august 2021 saturday 1112 episode highlights
Karthika Deepam 7 Aug Today Episode : కార్తీక దీపం 7 ఆగస్టు 2021, శనివారం ఎపిసోడ్ 1112 తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. 25 వ తేదీ గురించి పిల్లలు కూడా దీపను అడుగుతారు. 25త తేదీన ఎటైనా వెళ్దాం అన్నారు కదా. ఎప్పుడు వెళ్దాం అమ్మ అని అడుగుతారు. నాన్న లేరు కదా. నాన్నకు పెద్ద ఆపరేషన్ ఉందట.. అందుకే ఈరోజు కుదరదు. నాన్న వచ్చాక చూద్దాం.. అని చెప్పి పిల్లలకు సర్ది చెబుతుంది దీప.
karthika deepam 7 august 2021 saturday 1112 episode highlights
ఆ తర్వాత డాక్టర్ బాబు ఇంటికి వస్తారు. మోనిత గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతుంది దీప. అంజి మాత్రం ఏం చెబుతాడు. అంతకుముందు చెప్పిందే వాడు చెప్పాడు. ఈ పెళ్లి కాకుండా ఉండాలంటే అంజి చెప్పే మాటలు సరిపోవు.. అని కార్తీక్ అనగానే.. అంజిని తీసుకెళ్లి రోషిణి మేడం దగ్గరకి వెళ్లొచ్చు కదా.. అప్పుడు మీ పెళ్లి ఆగిపోతుంది కదా.. అంటే ఆవిడ నమ్మదు. దానికి సాక్ష్యం కావాలి.. అంటాడు. దీంతో సూర్యాపేట 8 హోటల్ లో మోనిత.. అంజిని బెదిరించినప్పుడు దీప తీసిన వీడియోను కార్తీక్ కు చూపిస్తుంది. ఆ వీడియో చూసి షాక్ అవుతాడు డాక్టర్ బాబు.
హిమను చంపించినట్టే.. నిన్ను కూడా చంపిస్తా. నువ్వు చేసిన ఒకటే సాయం.. కార్తీక్ ను చంపకుండా కేవలం హిమను మాత్రమే చంపడం.. అంటూ మోనిత.. అంజిని బెదరించే వీడియో చూస్తాడు కార్తీక్. ఇప్పుడు అర్థమయిందా? ఈ వీడియో సరిపోతుందా? ఈ వీడియో రోషిణి మేడమ్ కు చూపిస్తే చాలు. అంతా ఆమె చూసుకుంటుంది.. అనగానే కార్తీక్ తెగ టెన్షన్ పడిపోతాడు. దీంతో ఆగండి.. మంచినీళ్లు తెస్తాను.. అని దీప లోపలికి వెళ్లేలోపు డాక్టర్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్లిపోయాడు.. అని అటూ ఇటూ చూస్తుంది దీప. ఇంతలో పిల్లలు అక్కడికి వస్తారు. ఏంటమ్మా అంటే నాన్న.. అనగానే.. నాన్న ఇప్పుడే కారులో వెళ్తున్నారు.. అనగానే షాక్ అవుతుంది. వెంటనే డాక్టర్ బాబుకు ఫోన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారండి అని ఫోన్ చేయగానే.. డాక్టర్ భారతీ ఫ్రెండ్ చనిపోయింది.. చూడటానికి వెళ్తున్నా.. అని అబద్ధం చెబుతాడు. కానీ.. డాక్టర్ బాబు మోనితను చంపడానికి బయలు దేరుతాడు. దీపకు చెబితే కంగారు పడుతుందని చెప్పడు.
మరోవైపు భాగ్య ఇంకా ఇంటికి రాకపోవడంతో తెగ తెన్షన్ పడుతుంటాడు భాగ్య భర్త. తెలిసిన చోటుకు కూడా వెళ్లి ఎంక్వయిరీ చేసినా ఎవ్వరూ భాగ్య రాలేదని చెప్పడంతో.. ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. ఎక్కడుందో అర్థం కాక తలపట్టుకుంటాడు. భాగ్య కూడా తాళ్లు విప్పుకోవడానికి ఎంత ట్రై చేసినా అస్సలు తాళ్లు రావు. ఈ మోనిత ఇంకా ఏం చేస్తుందో ఏమో.. ఎటువంటి దారుణాలు జరుగుతాయో అని తనలో తానే అనుకుంటుంది.
కట్ చేస్తే.. మోనిత.. ఎక్కడికి వెళ్లాడు కార్తీక్ అని ఆలోచిస్తుంది. ఇంతలో ఆదిత్య ఫోన్ చేసి.. అన్నయ్య ఇక్కడికి వచ్చి వెళ్లాడు. చాలా సీరియస్ గా ఉన్నాడు. నాన్నకి వేరే ట్యాబ్లెట్లు రాసి వెళ్లాడు. ఏమైంది వదిన అని అడుగుతాడు ఆదిత్య. ఏం లేదు.. అని చెప్పి.. నేను తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పి దీప ఫోన్ కట్ చేస్తుంది.
karthika deepam 7 august 2021 saturday 1112 episode highlights
ఇక.. మోనిత విషయానికి వస్తే.. అంజి గాడు ఎక్కడికి పోయాడు. ఏసీపీ మేడమ్ దగ్గరికి వెళ్లి మొత్తం చెప్పేశాడా? అసలు.. వాడు తప్పించుకొని ఏం చేస్తాడు. నా పెళ్ ఆపేస్తాడా? అంటూ మోనిత ఆలోచిస్తుండగానే.. తన డోర్ తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. చూస్తే.. డాక్టర్ బాబు.. మోనిత ఇంట్లోకి వస్తుంటాడు. దీంతో మోనిత ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. కార్తీక్.. నా కార్తీక్ నువ్వు వచ్చావా? నాకు ఇది చాలు కార్తీక్. నువ్వు వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను అనుకుంటూనే ఉన్నాను.. వస్తాడు నా రాజు ఈరోజు అని పాడుకుంటూనే ఉన్నాను. నువ్వు ఎంత మంచివాడివి కార్తీక్. నా ప్రేమ.. నా తపన.. నా ఆశ.. అన్నీ అర్థం చేసుకొని నా కోసం వచ్చావా? రా కార్తీక్.. నీ కోసమే తపస్సు చేస్తున్నాను. రా.. నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిగా వచ్చావు కదూ. నా మనసులో పెంచుకున్న ప్రేమకు.. పెళ్లితోనే జవాబు చెప్పాలని వచ్చావు కదూ. రా కార్తీక్. రా.. అంటూ తెగ సంతోషపడుతుంది మోనిత.
karthika deepam 7 august 2021 saturday 1112 episode highlights
నోరు ముయ్యవే.. అని సీరియస్ గా అంటాడు కార్తీక్. ఏంటి.. కార్తీక్ అప్పుడే పెళ్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు అనగానే.. నా పెళ్లాం దీప. వెయ్యి మంది నీలాంటి వాళ్లు వచ్చినా తన కాలి గోటితో సమానం.. అని అనగానే.. కరెక్టే కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే కదా.. నన్ను పెళ్లి చేసుకోవడమే నీకు ఆప్షన్. అంతకు మించి నీకు ఇంకో ఆప్షన్ లేదు. నువ్వు ఎస్ అనాల్సిందే అనగానే.. ఎస్ ఈ సమస్యకు పరిష్కారం కోసమే వచ్చా. కానీ.. ఈ సమస్యకు పరిష్కారం నీ పెళ్లి కాదు.. నీ చావు.. అనగానే చావా? నాదా? నేనెందుకు చస్తాను.. ఎలా చేస్తాను. ఎప్పుడు చస్తాను.. అనగానే ఇఫ్పుడే నా చేతుల్లోనే చస్తావు అనగానే మోనిత షాక్ అవుతుంది. ఇవన్నీ వింటున్న భాగ్య కూడా షాక్ అవుతుంది. ఎందుకో తెలుసా? నిన్ను చంపాల్సింది కేవలం నన్ను ప్రేమించినందుకు.. నేను ప్రేమించినందుకు అమాయకురాలైన హిమను చంపించావు చూడు.. అందుకు నిన్ను చంపాలని వచ్చాను.. అని అసలు విషయం చెబుతాడు కార్తీక్.
karthika deepam 7 august 2021 saturday 1112 episode highlights
ఇక.. రోషిణి మేడమ్.. డాక్టర్ బాబు ఇంటికి వెళ్లి.. ఏది.. మోనిత శవాన్ని ఎక్కడ దాచిపెట్టావు అని నిలదీస్తుంది. దీంతో మోనిత శవం ఏంటి? అని అంటాడు డాక్టర్ బాబు. మోనితను షూట్ చేసి చంపేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? నీ భర్త మోనితను చంపేశాడు. పదా స్టేషన్ కు అంటూ.. కార్తీక్ ను పోలీస్ స్టేషన్ కు తరలిస్తుంది రోషిణి మేడమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి ==> వంద మెట్లు ఎక్కేసిన కార్తీకదీపం మోనిత.. మంచితనానికి శోభా శెట్టి నిదర్శనం
ఇది కూడా చదవండి ==> మహేష్ బాబు లెవెల్‌లో బిల్డప్.. చివరకు గాలిదీసేసిన డాక్టర్ బాబు
ఇది కూడా చదవండి ==> జానకి అబద్ధం చెప్పిందని.. పెద్ద శిక్ష వేసిన జ్ఞానాంబ.. ఆ శిక్షకు జానకి తలవంచుతుందా?
ఇది కూడా చదవండి ==> అసలు విషయం తెలుసుకొని.. మోనితను చంపడానికి బయలుదేరిన కార్తీక్.. ఆ తర్వాత ఏం జరిగింది? మోనితను కార్తీక్ చంపేశాడా?
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
This website uses cookies.