karthika deepam : వంద మెట్లు ఎక్కేసిన కార్తీకదీపం మోనిత.. మంచితనానికి శోభా శెట్టి నిదర్శనం
karthika deepam మనిషిని పైపైన చూసి ఓ అంచనాకు రావొద్దు.. అని అందరూ అంటుంటారు. మరీ ముఖ్యంగా ఈ సూత్రం తెరపై నటించే సెలెబ్రిటీలకు వర్తిస్తుంటారు. వారు చేసే పాత్రలను బట్టి జనాలు వారిని ఓ క్యారెక్టర్ అని డిసైడ్ చేసేస్తారు. నెగెటివ్ రోల్స్ వేస్తే వారు రియల్ లైఫ్‌లోనూ అలాంటి వారే అని ఫిక్స్ అయిపోతారు. కానీ వారు తెర మీద ఆ పాత్రకు తగ్టట్టు నటిస్తారు అంతే. కానీ తెర వెనుక మాత్రం అలా ఉండరు. తెరపై ఎంత విలనిజం, శాడిజం చూపిస్తారో తెర వెనుక అంత సున్నితంగా ఉంటారు.

Shobha Shetty Celebration At Orphanage For Youtube channel Success
కార్తీక దీపం karthika deepam సీరియల్‌లో మోనిత ఎలాంటి పాత్రను పోషిస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఆమెను పాత్రను చూస్తే ఎవ్వరైనా సరే కోపగించుకుంటారు. ఆమెను చంపేయాలన్నంతగా కసిగా ఉంటారు. అలా ఆమె ఆ పాత్రను రక్తి కట్టించింది కాబట్టే ఇప్పుడు ఇంతలా ఫేమస్ అయింది. మోనిత పాత్రలో శోభా శెట్టి అదరగొట్టేసింది. అలా శోభా శెట్టి తెరపైనే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది.ఈ మధ్యే యూట్యూబ్ చానెల్ పెట్టి జనాలకు మరింత దగ్గరై తన రియల్ లైఫ్ గురించి చెప్పేందుకు, చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
మంచితనానికి శోభా శెట్టి నిదర్శనం karthika deepam

Shobha Shetty Celebration At Orphanage For Youtube channel Success
యూట్యూబ్ బిజినెస్ ఇప్పుడు ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. తాను చానెల్ పెట్టిన 15 రోజులకే లక్ష మంది సబ్ స్క్రైబర్స్ అవ్వడంతో సెలెబ్రేట్ చేసుకుంది. అది కూడా అనాథాశ్రమంలో. తాను రెగ్యులర్‌గా వెళ్లే ఈ ఆశ్రమంలో తన చానెల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేసింది. అయితే ఇదేమీ తన గొప్పలు చెప్పుకునేందుకు వీడియో చేయడం లేదని, తనను చూసి ఏ ఒక్క స్ఫూర్తి పొంది సాయం చేసినా చాలని చెప్పుకొచ్చింది. పిల్లలకు తిను బండారాలు, పుస్తకాలు, మాస్కులు, శానిటైజర్లు పంచిపెట్టింది. వారికి రాఖీలు కట్టింది. అలా మొత్తానికి మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి ==> జానెడు కూడా ఉండదేమో!!.. బుల్లి నిక్కర్‌లో జబర్దస్త్ వర్ష
ఇది కూడా చదవండి ==> అసలు విషయం తెలుసుకొని.. మోనితను చంపడానికి బయలుదేరిన కార్తీక్.. ఆ తర్వాత ఏం జరిగింది? మోనితను కార్తీక్ చంపేశాడా?
ఇది కూడా చదవండి ==> ఆ ఒక్క వ్యక్తి అనుమానించేవారా!.. సింగర్ సునీత చెప్పింది అదేనా?
ఇది కూడా చదవండి ==> ఒక్క మాట చాలు.. బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్