Karthika Deepam : ఒక్కటైన దీప, కార్తీక్.. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకో దీపా.. వేడుకున్న డాక్టర్ బాబు
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 1100 చాలా ఎమోషనల్ గా ఉంది. నేడు 24 జులై 2020 న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో కార్తీక్, దీప్ ఒక్కటయ్యారు. నన్ను క్షమించు దీపా అని.. దీప మీద పడి.. కార్తీక్ వేడుకున్నాడు. తన తండ్రి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతుండటంతో తను చేసిన తప్పేంటో కార్తీక్ తెలుసుకున్నాడు. అయితే.. కార్తీక్ అంటే వాళ్ల నాన్న చాలా కోపం మీద ఉన్న సంగతి తెలిసిందే. కార్తీక్ మీద ఉన్న కోపంతో.. ఆసుపత్రిలో వైద్యం కూడా సరిగ్గా చేయించుకోకపోవడంతో.. కార్తీక్.. దీప మీద పడి విలపించాడు.

karthika deepam latest episode 1100 july 24 2020
నాకు నా శాపమే తగిలింది దీపా. నేను ఇన్నేళ్లు నా భార్యాబిడ్డలను దూరం పెట్టాను కదా. అదే ఇప్పుడు నాకు తగిలింది. మా డాడీ నన్ను తిట్టినా.. కొట్టినా బాగుండేది కానీ.. నన్ను ఆయన వెళ్లగొట్టేసరికి చాలా బాధేసింది. పోయి పోయి ఆ మోనిత చేతిలో మోసపోయా. పాముతో స్నేహం చేసినా బాగుండు కానీ.. ఆ మోనితతో చేశా. మోసపోయా. చూశావు కదా.. ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో.. నన్ను దగ్గరకు తీసుకో దీపా. ప్రేమగా ఇంకా దగ్గరకు తీసుకో.. ఆ ప్రేమలో జాలి, రాజీ ఏదీ ఉండకుండా.. ఇంకా దగ్గరగా తీసుకో.. అంటూ కార్తీక్.. దీప ముందు పశ్చాతాప పడతాడు. అయితే.. డాక్టర్ బాబు.. బాగా బాధపడుతుండటంతో.. అలా బయటికి వెళ్లి వద్దాం పదా డాక్టర్ బాబు.. అంటూ దీప డాక్టర్ బాబును బయటికి తీసుకెళ్తుంది.
Karthika Deepam : మళ్లీ కార్తీక్, దీప మధ్య ఇన్వాల్వ్ అయిన మోనిత
దీప, కార్తీక్ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తుంటే.. మోనిత కార్తీక్ ను ఆపుతుంది. అర్జెంట్ పని ఉంది.. అరగంటలో వచ్చేద్దాం పదా.. అంటూ కార్తీక్ ను మోనిత అడుగుతుంది. మా డాడీకి అలా ఉంటే.. నేను నీతో బయటికి రావాలా? అంటే మరి దీపతో అయితే వెళ్తారా? అంటే.. దీప, నువ్వు ఒక్కటేనా.. అంటూ సీరియస్ అవుతాడు కార్తీక్.

karthika deepam latest episode 1100 july 24 2020
నాకు తాళి కట్టలేదు.. తనకు కట్టావు.. అంతే కదా. ఆ తాళి ఒక్కటి కడితే అయిపోయె.. అప్పుడు నేను, దీపా ఒక్కటే.. అని అనేసరికి.. అసలు మా నాన్న ఇలా అవ్వడానికి కారణమే నువ్వు మోనిత అంటూ సీరియస్ అవుతాడు కార్తీక్. అయితే.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి.. మామయ్యకు చెప్పి మామయ్య ఆసుపత్రి పాలు అయ్యేలా చేశావు అంటూ మోనితను దీప తిడుతుంది.
అలా.. ఆసుపత్రిలో కార్తీక్, దీప.. మోనితపై తీవ్రంగా తిడతారు. ఇంత చేసి నువ్వు ఏ మొహం పెట్టుకొని ఇక్కడిక వచ్చావు.. ఏం కావాలి నీకు.. అంటూ ఎడాపెడా వాయించేస్తుంది. అయితే.. ఆయన నీకు మాత్రమే మామయ్య కాదు.. నాకు కూడా మామయ్యే. ఈనెల 25 తర్వాత కార్తీక్ మన ఉమ్మడి మొగుడు అవుతాడు.. అంటూ ఏదేదో వాగబోతుంటే.. స్టాప్ ఇట్.. నువ్వు బాగా ఊహించుకుంటున్నావు.. ఎక్కువ చేస్తున్నావు. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.

karthika deepam latest episode 1100 july 24 2020
అలా.. జులై 24 ఎపిసోడ్ మొత్తం.. కార్తీక్, దీప, మోనిత చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత మోనిత ఆసుపత్రి నుంచి వెళ్లిపోతుందా? మోనిత ఏం చేస్తుంది? దీప ఏం చేసింది? కార్తీక్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే.. ఈ రోజు రాత్రి 7.30 వరకు వెయిట్ చేయాల్సిందే.