Karthika Deepam Nirupam: ఖాళీగా ఉన్నప్పుడు అదే వాడతాను.. కార్తీక దీపం నిరుపమ్ కామెంట్స్ వైరల్

 Authored By prabhas | The Telugu News | Updated on :29 December 2021,2:20 pm

Karthika Deepam Nirupam: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుని అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సీరియల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతున్నప్పటికీ ఈ సీరియల్ కు పోటీగా మరి ఏ సీరియల్ కానీ ,ఏ కార్యక్రమం కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సీరియల్స్ ద్వారా డాక్టర్ బాబుగా ఎంతో ఫేమస్ అయ్యారు పరిటాల నిరుపమ్.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పరిటాల నిరుపమ్, తన భార్య మంజులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.తమ యూట్యూబ్ చానల్స్ లో ఎన్నో వీడియోలను షేర్ చేసి వారికి సంబంధించిన విషయాలన్నింటినీ పంచుకున్నారు. ఇకపోతే తాజాగా వీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Karthika deepam nirupam paritala do this things when his in leasure

Karthika deepam nirupam paritala do this things when his in leasure

ఆ సీక్రెట్ బయట పెట్టిన నిరుపమ్:

ఈ వీడియోలో భాగంగా పరిటాల నిరుపమ్,మంజుల దంపతుల కొడుకు రిక్కీ తమ తల్లిదండ్రులను ఇద్దరిని వారి ఫోన్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా రీక్కీ ముందుగా నిరుపమ్ ను ప్రశ్నిస్తూ…మీరు మీ మొబైల్ ఫోన్ లో ఎక్కువగా ఉపయోగించే యాప్ ఏంటి అని ప్రశ్నించారు. అందుకు నిరుపమ్ సమాధానం చెబుతూ ఎక్కువగా ఉపయోగించే యాప్ వాట్సాప్ అని సమాధానం చెప్పారు. దాంతో రిక్కి నేను ఇంకా ఇంస్టాగ్రామ్ అని చెబుతారు అనుకున్నాను అనగా అందుకు నిరుపమ్ ఇంస్టాగ్రామ్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వాడుతాను అంటూ సమాధానం చెప్పారు. ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి