Karthika Deepam : ఏంటి డాక్టర్ బాబూ ఇది.. అతుకుల చొక్కా వేసుకున్నావ్.. ఫోటో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : ఏంటి డాక్టర్ బాబూ ఇది.. అతుకుల చొక్కా వేసుకున్నావ్.. ఫోటో వైరల్

Karthika Deepam : పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఇంత ఫాలోయింగ్ ఉండదు. ఇంతమంది అభిమానులు ఉండరు. సోషల్ మీడియాలో ఇంత డిస్కషన్ కూడా ఉండదు. కానీ.. కార్తీక దీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పడి చచ్చిపోతారు జనాలు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. డాక్టర్ బాబు అంటే ఏంటి మాటలా? ఆయన పేరు నిరుపమ్ పరిటాల. కానీ.. డాక్టర్ బాబుగానే ఆయన బాగా ఫేమస్ అయ్యారు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 July 2021,3:38 pm

Karthika Deepam : పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఇంత ఫాలోయింగ్ ఉండదు. ఇంతమంది అభిమానులు ఉండరు. సోషల్ మీడియాలో ఇంత డిస్కషన్ కూడా ఉండదు. కానీ.. కార్తీక దీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పడి చచ్చిపోతారు జనాలు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. డాక్టర్ బాబు అంటే ఏంటి మాటలా? ఆయన పేరు నిరుపమ్ పరిటాల. కానీ.. డాక్టర్ బాబుగానే ఆయన బాగా ఫేమస్ అయ్యారు.

karthika deepam nirupam paritala viral photo

karthika deepam nirupam paritala viral photo

ఇదివరకు చాలా సీరియళ్లలో డాక్టర్ బాబు నటించినా.. పెద్దగా ఆయనకు గుర్తింపు రాలేదు. కానీ.. కార్తీక దీపం సీరియల్ తో ఆయనకు, వంటలక్కకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. డాక్టర్ బాబుకు ఎంత పాపులారిటీ ఉందంటే.. సోషల్ మీడియాలో ఆయన ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. అది క్షణాల్లో వైరల్ కావాల్సిందే.

Karthika Deepam : డాక్టర్ బాబు అతుకుల చొక్కా ఫోటో వైరల్

తాజాగా డాక్టర్ బాబు.. తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతుకుల చొక్కా వేసుకొని సీరియస్ లుక్ తో కనిపిస్తాడు డాక్టర్ బాబు. కాస్త నవ్వొచ్చు కదా.. అని నాకు చెప్పకండి. ఎందుకంటే.. ఫోటో తీసినోడు నవ్వొద్దు అన్నాడు. ఎందుకు అంటే ఆటిట్యూడ్ అన్నాడు. ఈసారికి ఇలా కానివ్వండి. నా అతుకుల షర్ట్ నచ్చితే ఆ క్రెడిట్ నాది కాదు. దాన్ని తయారు చేసినోళ్లది.. అని దాన్ని కుట్టినోళ్లను కూడా ట్యాగ్ చేశాడు. మీరు కూడా ట్రై చేస్తారా? అంటూ క్యాప్షన్ పెట్టాడు నిరుపమ్.

నిజానికి.. డాక్టర్ బాబు.. సీరియల్ లో కూడా అంతే. ఆయన క్యాస్టూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సీరియల్ లోనే కాదు.. బయట కూడా ఇలాంటి డిఫరెంట్ షర్ట్స్ వేసుకొని డాక్టర్ బాబు రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎంతైనా డాక్టర్ బాబుకు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ మరే నటుడికి లేదు. అది డాక్టర్ బాబు అంటే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది