Karthika Deepam Today Episode : నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు సంబంధం లేదు.. మోనితకు బిగ్ షాక్ ఇచ్చిన డాక్టర్ బాబు?
Karthika Deepam Today Episode : కార్తీక దీపం 1103 లేటెస్ట్ ఎపిసోడ్ జులై 28, 2021 హైలైట్స్ ఇవే. ఈ ఎపిసోడ్ లోనూ మోనిత.. తనను పెళ్లి చేసుకోవాలంటూ కార్తీక్ ను వేడుకుంటుంది. నీ భర్త అంటే నాకు చాలా ఇష్టం. నీ భర్తను వదిలి నేను ఉండలేను. అక్క ప్లీజ్.. నీ భర్తను నేను పెళ్లి చేసుకుంటా. దయచేసి నాకు వదిలేయ్. ఇప్పటికే నేను పెళ్లి కోసం సూట్ కూడా కొన్నా. రింగ్ కూడా కొన్నా. నన్ను ప్రేమించొద్దు అనే అధికారం ఎవ్వరికీ లేదు.. అని మోనిత అనేసరికి.. నాకుంది. నన్ను ప్రేమించే అధికారం నీకు లేదు.. అంటూ కార్తీక్ సీరియస్ అవుతాడు.

karthika deepam serial 28 july 2021 episode 1103 highlights
అంటే.. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవా.. అంటూ కార్తీక్ ను ప్రశ్నిస్తుంది. అవును.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను బాధ్యుడిని కాను. అది నాకు తెలియకుండా జరిగింది. నీకు తెలిసి జరిగింది కాబట్టి.. దానికి పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలి.. అంటూ కార్తీక్.. మోనితకు స్పష్టం చేస్తాడు. ఇప్పుడు నువ్వు కాదంటే ఎవరు ఊరుకుంటారు. ఎవరు ఒప్పుకుంటారు.. అంటూ మోనిత తిరిగి ప్రశ్నిస్తుంది. అవును.. కాదంటాను.. ఏం చేస్తావు.. నువ్వు పీక కోసుకున్నా కూడా నేను పట్టించుకోను. ఒక పెళ్లయిన మగాడిని, అది కూడా భార్యాబిడ్డలు ఉన్న వ్యక్తిని ప్రేమించడం పెద్ద తప్పు. ఆయన భార్య ముందు వచ్చి రచ్చ చేయడం ఇంకా పెద్ద తప్పు.
Karthika Deepam Today Episode : నీ భార్య కన్నా నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా
గత 16 ఏళ్ల నుంచి ఏ మగాడిని దగ్గరికి రానీయకుండా నిన్ను ఆరాధిస్తున్నాను. నాలా ఏ అమ్మాయి చేయదు. నీ భార్య కన్నా కూడా నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా. నీకు ఇలాంటి అమ్మాయి జన్మలో కూడా దొరకదు. నాకు నీ ఆస్తి అవసరం లేదు. నాకు ఒక తాళి కట్టు అంతే. నాకు నువ్వు కావాలి. నిన్ను నాకన్నా ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించరు. ప్రేమను మనసును శాసించాలి. నన్ను వదులుకుంటే.. నువ్వు నూరేళ్ల ప్రేమను దూరం చేసుకున్నవాడివి అవుతావు కార్తీక్.. అని మోనిత బెదిరిస్తుంది.

karthika deepam serial 28 july 2021 episode 1103 highlights
దీప.. నువ్వైనా చెప్పు.. కార్తీక్ కు.. నా తలరాత మార్చొద్దని చెప్పు అంటూ దీపను వేడుకుంటుంది మోనిత. ఆపవే నువ్వు. ఎందుకింత ఓవర్ చేస్తున్నావు. నీది ప్రేమా. ఇది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అయితే.. ఇలా బిచ్చగత్తెలా అడుక్కోరు. నీది ప్రేమ కాదు. అహం, కోపం, పంతం.. అందుకే… నువ్వు నీ పగతోనే నా భర్తను ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నావు. నిజంగా నువ్వు ఆయన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగేదానివి కాదు. నువ్వు నాలా ప్రేమించి ఉంటే.. నేను 10 ఏళ్లు నా భర్త కోసం ఎదురు చూశా. నువ్వు నాలా ఎదురు చూసేదానివా? నువ్వు అందని దాని కోసం తెగ ఆరాటపడితే.. నీకు అడిగింది ఇవ్వడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. నువ్వు అన్న ఆ తాడే.. భార్యాభర్తల బంధాన్ని పటిష్ఠం చేస్తుంది. ఆ తాడే ప్రేమ అనే చట్రంలో భార్యాభర్తలను పడేస్తుంది. ఇక నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. నీ ఉన్మాదాన్ని సహించే సహనం ఇక్కడ ఎవ్వరికీ లేదు.. అంటూ మోనితకు దీప స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

karthika deepam serial 28 july 2021 episode 1103 highlights
డాక్టర్ బాబు.. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అంటూ దీప చెప్పగానే.. కార్తీక్ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కార్తీక్ వద్దు.. నన్ను వదిలిపోకు.. అంటూ వేడుకుంటుంది. అయినా కూడా కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పోవయ్యా.. ఎక్కడికి వెళ్లినా 25 వ తేదీన రావాల్సిందే నువ్వు. నన్ను ఇలా మోసం చేస్తే.. మీ బతుకులు బజారున పడుతాయి. మిమ్మల్ని అస్సలు వదలను. మిమ్మల్ని నాశనం చేస్తాను. 25 వ తేదీన కార్తీక్ రావాల్సిందే. నా మెడలో తాళి కట్టాల్సిందే. లేదంటే నేను ఊరుకోను. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.. అంటూ మోనిత.. దీపకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.