Kaushik Reddy : టీఆర్ఎస్ లో చేరిన రోజే కౌశిక్ రెడ్డికి భారీ షాక్?
Kaushik Reddy టీఆర్ఎస్‌లో చేరిన రోజే హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డి Kaushik Reddy కి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ Congressకు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి Kaushik Reddy …టీఆర్ఎస్ TRS Party లో చేరనున్న సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు, జెండాలు కట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. వీటిని చూసిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిపై మొత్తం 10 ఫిర్యాదులు రాగా.. రూ. 2 లక్షల 50 వేల జరిమానా విధించారు. రెండు ఫిర్యాదులకు లక్ష రూపాయల చొప్పున ఒక ఫిర్యాదుకు రూ. 15 వేలు మిగిలిన వాటికి రూ. 5 వేల చొప్పున జీహెచ్ఎంసీ జరిమానా విధించింది.
టీఆర్ఎస్ TRS Party అధినేత కేసీఆర్ KCR సమక్షంలో పాడి కౌశిక్‌రెడ్డి Kaushik Reddy పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ .. కౌశిక్ రెడ్డికి రాజకీయాల్లో, టీఆర్ఎస్‌లో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకు తాను మార్గం సుగమం చేస్తానని హామీ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. అయితే రాజకీయాల్లో మన ప్రస్థానం కొనసాగాలని సీఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డికి సూచించారు. దీంతో కేసీఆర్ .. కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పడంతో.. ఇదేనా అంటూ సెటైర్లు పేలుతున్నాయి. చలాన్ల బాదుడుపైనా సర్వత్రా ట్రోల్స్ సాగుతున్నాయి.
ఫ్లెక్సీలు, హెల్డింగ్స్ పై .. ఫిర్యాదుల ఎఫెక్ట్.. Kaushik Reddy
కౌశిక్ రెడ్డి Kaushik Reddy టీఆర్ఎస్ TRS Party లో చేరుతున్న సందర్భంగా గచ్చిబౌలి నుండి టీఆర్ఎస్ భవన్ వరకూ భారీ ఎత్తున హోల్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహానగరంలో దాదాపు 20 కిలో మీటర్ల మేర వేలాది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని మంగళవారం ఏర్పాటు చేయగా బుధవారం సాయంత్రం వరకూ ఈ ఫ్లెక్సీలు, హోల్డింగ్స్ ఉన్నాయి. అయితే వీటిపై పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్ Congress, బీజేపీ BJP నేతలతో పాటు నెటిజన్ లు సోషల్ మీడియా వేదికగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుండి జీహెచ్ఎంసీ GHMC ఎన్ ఫోర్స్ మెంట్ సదరు ఫ్లెక్సీలు, హోల్డింగ్ తొలగించే పని ప్రారంభించింది.
ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినందుకు కౌశిక్ రెడ్డి Kaushik Reddy కి జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ రూ.5.60 లక్షలు జరిమానా విధించింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించి జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ జీహెచ్ఎంసి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే ప్రధమమని తెలుస్తోంది. గతంలో పది వేలు, 20వేలు, లక్ష వరకూ మాత్రమే జరిమానాలు వసూలు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డికి బల్దియా భలే షాకిచ్చిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. మరి దీనిపై కౌశిక్ రెడ్డి ఏం చేస్తారన్న చర్చ నడుస్తోంది.