Kavitha Comments : హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ – కవిత సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kavitha Comments : హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ – కవిత సంచలన వ్యాఖ్యలు

 Authored By sudheer | The Telugu News | Updated on :3 September 2025,2:00 pm

Kavitha Key Comments on Harish Rao : బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు ట్రబుల్‌ షూటర్ కాదని, బబుల్‌ షూటర్ అని ఎద్దేవా చేశారు. ఆయనే సమస్యలు సృష్టించి, తర్వాత వాటిని పరిష్కరించినట్లు నటిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అంశంలో రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌కు తాను ఎప్పటికీ హాని కలిగించనని స్పష్టం చేశారు.

Kavitha Key comments on Harish Rao

Kavitha Key comments on Harish Rao

హరీశ్‌రావు, సంతోష్‌రావులు కలిసి బీఆర్ఎస్ పార్టీని అస్తవ్యస్తం చేయాలని కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. వీరి చర్యల వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల రాజేందర్ లాంటి నేతలు పార్టీని వీడాల్సి వచ్చిందని కవిత ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఈటల విజయంలో కూడా హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారని విమర్శించారు. అంతేకాకుండా కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలకు నిధులు పంపిన వారే హరీశ్‌రావు అని కవిత ఆరోపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇకపోతే, తాను పదవుల కోసం కాకుండా, కేసీఆర్ కుటుంబ గౌరవం కోసం మాత్రమే పోరాడుతున్నానని కవిత తెలిపారు. తనపై ఎన్నో కుట్రలు, అవమానాలు జరిగినా, కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు. హరీశ్‌రావును పార్టీ లోపల “నక్కజిత్తు”లా వ్యవహరించేవారని, కేటీఆర్‌ను మభ్యపెడుతూ తప్పుదారులు పట్టిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి, కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేస్తూ, పార్టీ భవిష్యత్తుపై మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Tags :

    sudheer

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది