Kavya Maran : మరి కొద్ది రోజులలో ఐపీఎల్ మొదలు కానుంది. దీని కోసం ఆటగాళ్లని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలు కానుంది. అయితే టోర్నీ కోసం కోట్లు ఖర్చు చేసే ఫ్రాంచైజీలు.. తాము కొనుగోలు చేసిన ప్లేయర్లు కచ్చితంగా అద్భుత ఆటతీరు కనబరచాలని కోరుకుంటారు. ఈ తరుణంలోనే మెగా వేలానికి వెళ్లకుండా.. తమతోనే మూడేళ్ల పాటు రిటెన్షన్ చేసుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. ఈ అమ్మడు ప్యాట్ కమిన్స్ కోసం కావ్య మారన్ రూ. కోట్లు కుమ్మరించినప్పుడు తొలుత అందరూ ఆశ్చర్యపోయారు. ఓ ప్లేయర్ కోసం రూ. 20.50 కోట్లు వెచ్చించడం ఏంటని ప్రశ్నించారు. కానీ ఆ తర్వాత కావ్య మారన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.
ఇక ఇప్పుడు రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను వారితోనే ఉంచుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు అన్ని దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు చేశాయి. హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ తమ మొదటి మూడు ప్రాధాన్యత ప్లేయర్లుగా ఖరారు చేసింది సన్ రైజర్స్.
ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్ రైజర్స్ టీమ్ దక్కించుకోవాలని అనుకుంటున్నప్పటికీ అయిదుగురు క్లాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ ఉండటంతో కీలక ప్లేయర్లు నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లను వదులుకోవల్సిన పరిస్థితి. సుందర్ ఇటీవల అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరిచి అందరి దృష్టిలో పడ్డాడు. ఆల్‌రౌండర్‌గా తన వాల్యూ ఏంటో అందరికి తెలిసి వచ్చింది. సుందర్‌ని తీసుకోవాలని కావ్య భావించిన రిటెన్షన్ నిబంధనల వలన అతడిని తప్పక వదులుకునే పరిస్థితి. అయితే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వంటి టీమ్స్ మాత్రం సుందర్‌పై ఓ కన్నేసాయి.
Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం…
Post Office : సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Health Benefits : మన శరీరానికి జామ ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసినదే. కానీ ఈ జామ…
Zodiac Signs : ఈనెల 31వ తేదీ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే ఈనెల 31 నవంబర్…
Diwali 2024 : భారత దేశంలో అతిపెద్ద పండుగగ దీపావళి. దీన్ని దీపాల పండుగ అని కూడా అంటారు. హిందువులు…
Kiran Abbavaram : యంగ్ అండ్ టాలెండ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే…
AP DSC 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు అవుతున్న సందర్భంగా వారి మానిఫెస్ట్ లో…
AP Government Credit : ఏపీలో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పరిపాలన విషయంలో ప్రజల దృష్టిలో…
This website uses cookies.