KCR : పాలిటిక్స్‌లో ఎవరూ శాశ్వత శత్రువులు కారు, ఎవరూ శాశ్వత మిత్రులు కారు అనే మాట ఊరికెనే రాలదు. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఎంపీ కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్ వేరు వేరు పార్టీలకు చెందిన వారు. రాజకీయాల పరంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుంటారు. కానీ శుక్రవారం జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. ఇదే కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంపై ప్రశంసలు కురిపించారు ఎంపీ కోమటిరెడ్డి.
పరిపాలన సుగుమం కావడానికి 33 జిల్లాలను ఏర్పాటు చేశారని, వాటిలో కలెక్టరేట్ భవనాలను సైతం నిర్మించినందుకు సీఎంకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని సరదాగా గడిపారు. వీరు తీరును చూసి కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత కాలం ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం, దుమ్మెత్తిపోయడం వంటివి వీరిద్దరి మధ్య కనిపించాయి. కానీ ఈ కార్యక్రమంలో వీరిద్దరూ ఒక్కటైపోయారా? అనే విధంగా వీరి సరదాగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడం, రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడంతో అప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. కానీ వీరిద్దరు ఒకే వేదిపై కలిసి నవ్వులు చిందించడంపై రాజకీయంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి జనగామ జిల్లా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం కిందకు వస్తుంది. దీని వల్ల ఆయన ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి హాజరయ్యారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ లోలోపల మాత్రం వీరి కలయికపై ఆయా పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి కేసీఆర్ తో కలిసిపోతారా? అన్న సందేహాలు సైతం వారిని వెంటాడుతున్నాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.