KCR : ఎంపీ కోమటిరెడ్డిని కౌగిలించుకున్న కేసీఆర్.. రాజకీయాల్లో కొత్త చర్చ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : ఎంపీ కోమటిరెడ్డిని కౌగిలించుకున్న కేసీఆర్.. రాజకీయాల్లో కొత్త చర్చ..

KCR : పాలిటిక్స్‌లో ఎవరూ శాశ్వత శత్రువులు కారు, ఎవరూ శాశ్వత మిత్రులు కారు అనే మాట ఊరికెనే రాలదు. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఎంపీ కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్ వేరు వేరు పార్టీలకు చెందిన వారు. రాజకీయాల పరంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుంటారు. కానీ శుక్రవారం జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. ఇదే కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పాల్గొన్నారు. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 February 2022,2:30 pm

KCR : పాలిటిక్స్‌లో ఎవరూ శాశ్వత శత్రువులు కారు, ఎవరూ శాశ్వత మిత్రులు కారు అనే మాట ఊరికెనే రాలదు. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఎంపీ కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్ వేరు వేరు పార్టీలకు చెందిన వారు. రాజకీయాల పరంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుంటారు. కానీ శుక్రవారం జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. ఇదే కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంపై ప్రశంసలు కురిపించారు ఎంపీ కోమటిరెడ్డి.

పరిపాలన సుగుమం కావడానికి 33 జిల్లాలను ఏర్పాటు చేశారని, వాటిలో కలెక్టరేట్ భవనాలను సైతం నిర్మించినందుకు సీఎంకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని సరదాగా గడిపారు. వీరు తీరును చూసి కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత కాలం ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం, దుమ్మెత్తిపోయడం వంటివి వీరిద్దరి మధ్య కనిపించాయి. కానీ ఈ కార్యక్రమంలో వీరిద్దరూ ఒక్కటైపోయారా? అనే విధంగా వీరి సరదాగా ఉన్నారు.

kcr embracing komatireddy venkat reddy

kcr embracing komatireddy venkat reddy

KCR : ఎంపీని కౌగిలించుకుని..

కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడం, రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడంతో అప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. కానీ వీరిద్దరు ఒకే వేదిపై కలిసి నవ్వులు చిందించడంపై రాజకీయంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి జనగామ జిల్లా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం కిందకు వస్తుంది. దీని వల్ల ఆయన ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి హాజరయ్యారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ లోలోపల మాత్రం వీరి కలయికపై ఆయా పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి కేసీఆర్ తో కలిసిపోతారా? అన్న సందేహాలు సైతం వారిని వెంటాడుతున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది