kcr : ఔను.. కేసీఆర్‌కు ముందే తెలుసా షర్మిల పార్టీ పెడుతున్నట్లు, ఆ మాటలకు అర్థం ఇదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kcr : ఔను.. కేసీఆర్‌కు ముందే తెలుసా షర్మిల పార్టీ పెడుతున్నట్లు, ఆ మాటలకు అర్థం ఇదేనా?

 Authored By himanshi | The Telugu News | Updated on :9 February 2021,8:27 pm

kcr :  గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజం అయ్యింది. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెడ్డి తెలంగాణలో జెండా ఎగురవేసేందుకు సిద్దం అయ్యారు. తెలంగాణలో షర్మిల వైకాపా పగ్గాలు చేత పట్టాలని చాలా మంది చాలా కాలంగా కోరుకుంటున్నారు. కాని వైకాపాకు తెలంగాణలో ఛాన్స్‌ లేవని ఇప్పటికే తేలిపోయింది. కనుక తెలంగాణ లో కొత్తగా పార్టీ పెడితేనే అంతో ఇంతో ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు షర్మిలకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇంకా తెలంగాణలో ఉన్న రాజన్న అభిమానులు మరియు కొందరు సానుభూతి పరులతో మాట్లాడి షర్మిల నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తాజా సమావేశంలో చెప్పుకొచ్చింది.

Is kcr already know about ys sharmila new party

Is kcr already know about ys sharmila new party

షర్మిల కొత్త పార్టీ గురించి కేసీఆర్‌ మొన్ననే వ్యాఖ్యలు…

ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి మార్పు విషయమై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన మరో మాట ఫోకస్ లోకి రాలేదు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా ప్రాంతీయ పార్టీలు పెట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. తెలుగు దేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు మినహా మరే పార్టీకి కూడా అవకాశంను ప్రజలు ఇవ్వలేదు. కనుక ఇప్పుడు కొత్త పార్టీ వచ్చినంత మాత్రాన ఎవరు ఏం చేయరు అన్నట్లుగా కేసీఆర్‌ మాట్లాడాడు. ఆ మాటలు మొదట కొందరు ఈటెలను ఉద్దేశించి అన్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కాని తాజాగా షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తేలిపోయిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు షర్మిల ప్రాంతీయ పార్టీని ఉద్దేశించి అంటూ తేలిపోయింది.

kcr : కేసీఆర్‌ తెర వెనుక ఉన్నాడా..

షర్మిల పార్టీ గురించే మొన్న కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేశాడు అనేది అందరు అంటున్న మాట. అయితే ఒక వైపు షర్మిల పార్టీకి అంత సీన్ లేదు అంటూనే మరో వైపు ఆమెకు మద్దతు ఇస్తున్నదే స్వయంగా టీఆర్‌ఎస్‌ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ మరియు బీజేపీ ఓట్లను చీల్చేందుకు కేసీఆర్‌ వేసిన ఎత్తుగడ ఇందుకు జగన్‌ మరియు షర్మిలలు సహకరిస్తున్నారు అంటూ ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు షర్మిల పార్టీని ఒక స్థాయి వరకే ఉంచడంతో పాటు మరో వైపు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చేందుకు ప్రయత్నాలు చేయడం ఇక్కడ గమనించవచ్చు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది