KCR : అన్నాచెల్లెల్ల మధ్య రాజకీయ వైరం.. కవితను అడ్డుకున్న కేటీఆర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : అన్నాచెల్లెల్ల మధ్య రాజకీయ వైరం.. కవితను అడ్డుకున్న కేటీఆర్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :24 November 2021,4:10 pm

KCR : తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చకచకా చోటు చేసుుకంటున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు ఢిల్లీ కేంద్రంగా జరుగుతుండటం గమనార్హం. సీఎం కేసీఆర్ సతీమణి శోభ అనారోగ్యం దృష్ట్యా ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు..అక్కడే రాజకీయాలపై పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే కేంద్ర బిందువు అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన తనయ కవితను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

ఈ మేరకు టీఆర్ఎస్ వర్గాలు కూడా చర్చించుకున్నాయి. కానీ, నిర్ణయాలు ప్రస్తుతం అనూహ్యంగా మారిపోయాయి. రాజ్యసభకు వెళ్తారని భావించిన కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. నిజానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆకుల లలిత పోటీ చేయబోతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పార్టీ శ్రేణులు కూడా పేర్కొన్నాయి. కానీ, అనూహ్యంగా సీఎం కేసీఆర్ తనయ కవిత పేరు తెర మీదకు వచ్చింది. ఇందూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి కవితి మండలి మెట్లెక్కబోయే చాన్సెస్ మెండుగా ఉన్నాయి.

kcr political war between ktr and kavita

kcr political war between ktr and kavita

KCR : మళ్లీ ఆ స్థానంలో కవిత..!

కవితను ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది కేటీఆరేనని వార్తలు వస్తున్నాయి. అయితే, చెల్లెలు రాష్ట్రరాజకీయాల్లో ఉండటం వల్ల పార్టీకి బలం చేకూరుతుందని కేటీఆర్ భావించినట్లు తెలుస్తోంది. కొద్ది కాలం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అంతగా కీలక పాత్ర పోషించిన కవిత.. త్వరలో కేబినెట్‌లోకి మంత్రిగా వెళ్లి పార్టీని బలోపేతం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇకపోతే నిజామాబాద్ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు ఉన్న బలాన్ని బట్టి కవిత ఏకగ్రీవమవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కేటీఆర్, కవితల స్థానం ఏంటి.. వారు రాజకీయంగా పోషించాల్సిన పాత్రపైన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందట. ఈ క్రమంలోనే వారి అవసరాలను బట్టి వారికి తగు అవకాశాలు ఇస్తున్నారనే చర్చ కూడా సాగుతున్నది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది