KCR : ఈ సారి సభలో మామూలుగా ఉండదు.. కేసీఆర్ బిగ్ నిర్ణయం..!
KCR : సీఎం కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. నిజానికి ఈ సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించాలని.. ఈ సచివాలయానికి ఆయన పేరు పెట్టినప్పుడు ఆయన జయంతి రోజు కాకుండా నీ జయంతి రోజు ఎలా ఓపెన్ చేస్తావు అంటూ పలువురు ప్రతిపక్షనేతలు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. అదంతా పక్కన పెడితే.. ఫిబ్రవరి 17 న తన పుట్టిన రోజున సచివాలయాన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ బహిరంగ సభకు వేరే రాష్ట్రాలకు చెందిన చాలామంది నాయకులను పిలిచి సభను జయప్రదం చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారట. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తేజస్వి యాదవ్.. ఇలా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులను ఈ సభకు పిలవాలని సీఎ కేసీఆర్ అనుకుంటున్నట్టు సమాచారం. వీళ్లంతా సచివాలయం ప్రారంభోత్సవానికి హాజరు అయి ఆ తర్వాత సీఎం బహిరంగ సభకు హాజరు అవుతారట. మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు కానీ.. పక్క రాష్ట్రం ఏపీ సీఎం జగన్ ను సచివాలయం ప్రారంభోత్సవానికి పిలుస్తున్నారా?
KCR : ఏపీ సీఎం కూడా వస్తారా?
లేదా అని తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆహ్వానం అందితే ఏపీ సీఎం జగన్ వస్తారా.? రారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఫోకస్ మొత్తం బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరించే విధంగా ఉంది. దానికోసమే ఆయన పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లకు వేరే రాష్ట్రాల నాయకులను సీఎం కేసీఆర్ పిలుస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను తన పార్టీతో పాటు కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఖమ్మంలోనూ భారీ బహిరంగ సభను నిర్వహించారు.