Kesineni Nani విజయవాడ టీడీపీ పార్టీకి కంచుకోట. కానీ రాను రాను ఇక్కడ టీడీపీ మసకబారుతోందని చాలా మంది చర్చించుకుంటున్నారు. విజయవాడ నుంచే టీడీపీకీ ఎంపీ కేశినాని నాని, బోండా ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వీరంతా ప్రస్తుతం ఎంపీ కేశినేని నానికి వ్యతిరేఖంగా పని చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కొన్ని పరిణామాల తర్వాత చంద్రబాబు కేశినేని నానిని దూరం పెడుతున్నారని వార్తలు వచ్చాయి.
కానీ ప్రస్తుతం టీడీపీ పార్టీ చేపట్టిన ఢిల్లీ పర్యటనలో ఇటువంటిదేం లేదని తేటతెల్లమయింది. ఆ పర్యటనలో ఎంపీ నాని అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పర్యటన మొత్తం చంద్రబాబు వెంటే ఉండి అన్నీ తానై వ్యవహరించారు.అప్పటి వరకు తనదైన హవా చూపించిన నానిని కార్పోరేషన్ ఎన్నికలు పీడకలలా మిగిలిపోయాయి. అధిష్టానంతో కొట్లాడి మరీ తన కూతురుకు మేయర్ సీటును ఖాయం చేసుకుని వచ్చిన నానికి ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చాయి.
దీంతో నాని కూతురు మేయర్ గా కాకుండా కార్పోరేటర్ గానే మిగిలిపోయింది. నాని కూతురుకు మేయర్ సీటు ఇవ్వడంపై టీడీపీలో ఉన్న బోండా ఉమ, బుద్దా వెంకన్న వంటి నేతలు బాహాటంగానే విమర్శించారు. అయినా కానీ చంద్రబాబు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాని కొంత మనస్థాపం చెందినట్లు అందరూ చర్చించుకున్నారు.కానీ ఆ తర్వాత జరిగిన చంద్రబాబు దీక్షలో కేశినేని నాని పాల్గొని అందర్నీ షాక్ కు గురి చేశారు. ఆ సమావేశంలో మాట్లాడిన నాని అధికార వైసీపీని తీవ్రంగా విమర్శించారు.
దీంతో నాని టీడీపీలోనే ఉంటారని అందరికీ అర్థమైంది. అటు తర్వాత జరిగిన ఢిల్లీ ఎపిసోడ్ లో కూడా చంద్రబాబు నానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. నానికి ప్రాధాన్యతనివ్వడాన్ని బోండా ఉమ, బుద్దా వెంకన్న లాంటి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని బెజవాడ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరి బెజవాడలో ఏం జరుగుందో వేచి చూడాలి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.