Kesineni Nani : త్వరలో విజయవాడ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kesineni Nani : త్వరలో విజయవాడ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? 

Kesineni Nani విజయవాడ టీడీపీ పార్టీకి కంచుకోట. కానీ రాను రాను ఇక్కడ టీడీపీ మసకబారుతోందని చాలా మంది చర్చించుకుంటున్నారు. విజయవాడ నుంచే టీడీపీకీ ఎంపీ కేశినాని నాని, బోండా ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వీరంతా ప్రస్తుతం ఎంపీ కేశినేని నానికి వ్యతిరేఖంగా పని చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కొన్ని పరిణామాల తర్వాత చంద్రబాబు కేశినేని నానిని దూరం పెడుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం టీడీపీ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 November 2021,3:50 pm

Kesineni Nani విజయవాడ టీడీపీ పార్టీకి కంచుకోట. కానీ రాను రాను ఇక్కడ టీడీపీ మసకబారుతోందని చాలా మంది చర్చించుకుంటున్నారు. విజయవాడ నుంచే టీడీపీకీ ఎంపీ కేశినాని నాని, బోండా ఉమ, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వీరంతా ప్రస్తుతం ఎంపీ కేశినేని నానికి వ్యతిరేఖంగా పని చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కొన్ని పరిణామాల తర్వాత చంద్రబాబు కేశినేని నానిని దూరం పెడుతున్నారని వార్తలు వచ్చాయి.

కానీ ప్రస్తుతం టీడీపీ పార్టీ చేపట్టిన ఢిల్లీ పర్యటనలో ఇటువంటిదేం లేదని తేటతెల్లమయింది. ఆ పర్యటనలో ఎంపీ నాని అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పర్యటన మొత్తం చంద్రబాబు వెంటే ఉండి అన్నీ తానై వ్యవహరించారు.అప్పటి వరకు తనదైన హవా చూపించిన నానిని కార్పోరేషన్ ఎన్నికలు పీడకలలా మిగిలిపోయాయి. అధిష్టానంతో కొట్లాడి మరీ తన కూతురుకు మేయర్ సీటును ఖాయం చేసుకుని వచ్చిన నానికి ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చాయి.

Kesineni Nani developments in vijayawada

Kesineni Nani developments in vijayawada

Kesineni Naniఆ విషయంలో భంగపడ్డ నాని..

దీంతో నాని కూతురు మేయర్ గా కాకుండా కార్పోరేటర్ గానే మిగిలిపోయింది. నాని కూతురుకు మేయర్ సీటు ఇవ్వడంపై టీడీపీలో ఉన్న బోండా ఉమ, బుద్దా వెంకన్న వంటి నేతలు బాహాటంగానే విమర్శించారు. అయినా కానీ చంద్రబాబు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాని కొంత మనస్థాపం చెందినట్లు అందరూ చర్చించుకున్నారు.కానీ ఆ తర్వాత జరిగిన చంద్రబాబు దీక్షలో కేశినేని నాని పాల్గొని అందర్నీ షాక్ కు గురి చేశారు. ఆ సమావేశంలో మాట్లాడిన నాని అధికార వైసీపీని తీవ్రంగా విమర్శించారు.

దీంతో నాని టీడీపీలోనే ఉంటారని అందరికీ అర్థమైంది. అటు తర్వాత జరిగిన ఢిల్లీ ఎపిసోడ్ లో కూడా చంద్రబాబు నానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. నానికి ప్రాధాన్యతనివ్వడాన్ని బోండా ఉమ, బుద్దా వెంకన్న లాంటి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని బెజవాడ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మరి బెజవాడలో ఏం జరుగుందో వేచి చూడాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది