Post Office Scheme : పోస్టాఫీసు స్కీమ్ .. డబల్ ఇన్కమ్ .. లక్షకి రెండు లక్షలు గ్యారెంటీ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Post Office Scheme : పోస్టాఫీసు స్కీమ్ .. డబల్ ఇన్కమ్ .. లక్షకి రెండు లక్షలు గ్యారెంటీ ..!!

Post Office Scheme : మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటాం. మనం సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు అధిక రాబడి రావాలని కోరుకుంటాం. అలాగే పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి ఇబ్బందు లేకుండా ఉండాలని అనుకుంటాం. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ పథకం ఒకటి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాలకు సొమ్ము […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 March 2023,10:20 am

Post Office Scheme : మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటాం. మనం సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు అధిక రాబడి రావాలని కోరుకుంటాం. అలాగే పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి ఇబ్బందు లేకుండా ఉండాలని అనుకుంటాం. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ పథకం ఒకటి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాలకు సొమ్ము డబల్ అవుతుంది.

Kisan vikas Patra Post Office Scheme gives double income

Kisan vikas Patra Post Office Scheme gives double income

ఈ పథకం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ ఆర్బిఐ సవరించిన రెపో రేట్ల కారణంగా ఖాతాదారులకు అధిక రాబడిని అందిస్తుంది. ఈ పథకంలో డబ్బులు పెడితే 10 సంవత్సరాలకు డబల్ అవుతుంది. అలాగే పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. కనీస పరిమితి 1000 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో ఎక్కువగా 7.2% వార్షిక వడ్డీని అందిస్తారు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 120 నెలల కాలానికి సొమ్ము డబుల్ అవుతుంది. కేవీపీ వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తూ ఉంటారు.

Kisan vikas Patra Post Office Scheme gives double income

Kisan vikas Patra Post Office Scheme gives double income

కిసాన్ వికాస్ పత్ర పథకాన్ని 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు తీసుకోవచ్చు. పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్‌కు అనుకూలంగా సంరక్షకుడు కూడా ఖాతాను తెరిచే అవకాశం ఉంది. ఈ పథకంలో పెట్టుబడి డిపాజిట్ తేదీ నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలల కాలానికి లాక్ చేసి ఉంటుంది. అయితే ఇందులో పెట్టిన పెట్టుబడిని హామీనిస్తూ రుణం పొందే సౌకర్యం ఉంది. మెచ్యూరిటీ టైంలో టీడీఎస్ మినహాయింపు ఉన్న రిటర్న్స్ లో మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది