YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం ఒక సంచలనం అని చెప్పవచ్చు. 2009 ఎన్నికలలో కడప ఎంపీగా గెలిచిన జగన్ అదే ఎన్నికలలో తన తండ్రి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోగొట్టుకోవడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ ఐకాన్ అండ్ వైయస్ జగన్ పై తప్పుడు కేసులు పెట్టడం ఆయన జైలుకు పంపించడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని…

టిడిపి పెద్దలను ఎదిరించి వైయస్ జగన్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అప్పటినుండి వైయస్ జగన్ కి అండదండగా ఉంటూ… YSRCP పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక… నిండు అసెంబ్లీలో తనకి అత్యంత నమ్మకస్తుడు పార్టీలో ఏకైక నాయకుడు కొడాలి నాని అని అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో తనలో ఊపిరి ఉన్నంతవరకు వైయస్ జగన్ తోనే రాజకీయ ప్రస్థానం ఉంటుందని కొడాలి నాని పలు సందర్భాలలో తెలిపారు.

అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2020లో వచ్చిన సంక్రాంతి పండుగ సమయంలో… గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావడం తెలిసిందే. ఆ కార్యక్రమంలో కొడాలి నాని తన కుటుంబ సభ్యులను వైయస్ జగన్ కి పరిచయం చేయటం జరిగింది. ఈ క్రమంలో కొడాలి నాని ఇద్దరు కూతుర్లను జగన్ చూసి షాక్.. అవటం మాత్రమే కాదు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకున్న అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.