Kodali Nani : ఇటీవల చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. దీంతో తనపై చేసిన విమర్శల విషయంలో కొడాలి నాని కౌంటర్లు ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ కూడా చంద్రబాబు దయవల్ల గెలవలేదని చెప్పుకొచ్చారు. గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. నిమ్మకూరులో చంద్రబాబు నిద్ర చేయటంపై కూడా కొడాలి నాని సెటైర్లు వేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల ఏర్పాటుకు చంద్రబాబుకి సంబంధం లేదన్నారు.
తాను జూనియర్ ఎన్టీఆర్ కలిసి అరవై లక్షల ఖర్చు చేసి ఎన్టీఆర్ స్వగ్రామం కావటంతో అక్కడ ఇద్దరు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 40 లక్షలు తను 20 లక్షలు రూపాయలు ఖర్చు చేసి… అక్కడ “ఆంధ్రావాలా” సినిమా ఆడియో కార్యక్రమం నిర్వహించినట్లు మొత్తంగా అక్కడ కోటి రూపాయల ఖర్చు చేసినట్లు అది ఆ రోజుల్లో ఎక్కువ అని కొడాలి నాని తెలిపారు. ఇదే సమయంలో నిమ్మకూరు గ్రామానికి నాడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ 12 కోట్ల రూపాయలు కేటాయించారని కొడాలి నాని వివరించారు. అసలు ఎన్టీఆర్ కోసం చంద్రబాబు చేసింది ఏమీ లేదని అన్నారు. గుడివాడలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది.
చంద్రబాబు మూడు కిలోమీటర్ల ప్రయాణించడానికి 5 గంటల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు రావి వెంకటేశ్వరరావు, రాము, ఎన్టీఆర్ తనయుడు నలుగురు ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడ అంటే అన్ని సామాజిక వర్గాలు.. అందరూ కలిసి ఉండే ప్రాంతం. ఈ నలుగురు రావటానికి ఇదేమైనా కమ్మ సంఘం సమావేశం అని ప్రశ్నించారు. ఇదే సమయంలో చంద్రబాబు గుడివాడలో తనపై చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని ఖండించారు. తనని ఓడించాలని ఎప్పటినుండో ట్రై చేస్తున్నారు. 2024లో కూడా తానే గెలుస్తానని కొడాలి నాని స్పష్టం చేశారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.