Kodali Nani : ఎన్టీఆర్ “ఆంధ్రావాలా” ఫంక్షన్ కి ఖర్చుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kodali Nani : ఎన్టీఆర్ “ఆంధ్రావాలా” ఫంక్షన్ కి ఖర్చుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!

Kodali Nani : ఇటీవల చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. దీంతో తనపై చేసిన విమర్శల విషయంలో కొడాలి నాని కౌంటర్లు ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ కూడా చంద్రబాబు దయవల్ల గెలవలేదని చెప్పుకొచ్చారు. గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. నిమ్మకూరులో చంద్రబాబు నిద్ర చేయటంపై కూడా కొడాలి నాని సెటైర్లు వేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల ఏర్పాటుకు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :16 April 2023,9:00 am

Kodali Nani : ఇటీవల చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. దీంతో తనపై చేసిన విమర్శల విషయంలో కొడాలి నాని కౌంటర్లు ఇస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ కూడా చంద్రబాబు దయవల్ల గెలవలేదని చెప్పుకొచ్చారు. గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. నిమ్మకూరులో చంద్రబాబు నిద్ర చేయటంపై కూడా కొడాలి నాని సెటైర్లు వేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల ఏర్పాటుకు చంద్రబాబుకి సంబంధం లేదన్నారు.

Ju NTR – I decided together, the cost is both of us: Kodali Nani..!! | Kodali  Nani Reveals Jr NTR spent own funds for NTR Statue at Nimmakur, Fires on  Chandra Babu

తాను జూనియర్ ఎన్టీఆర్ కలిసి అరవై లక్షల ఖర్చు చేసి ఎన్టీఆర్ స్వగ్రామం కావటంతో అక్కడ ఇద్దరు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 40 లక్షలు తను 20 లక్షలు రూపాయలు ఖర్చు చేసి… అక్కడ “ఆంధ్రావాలా” సినిమా ఆడియో కార్యక్రమం నిర్వహించినట్లు మొత్తంగా అక్కడ కోటి రూపాయల ఖర్చు చేసినట్లు అది ఆ రోజుల్లో ఎక్కువ అని కొడాలి నాని తెలిపారు. ఇదే సమయంలో నిమ్మకూరు గ్రామానికి నాడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ 12 కోట్ల రూపాయలు కేటాయించారని కొడాలి నాని వివరించారు. అసలు ఎన్టీఆర్ కోసం చంద్రబాబు చేసింది ఏమీ లేదని అన్నారు. గుడివాడలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది.

Kodali Nani Says He Spent 1 Crore On NTR Andhrawala Audio Function

Kodali Nani Says He Spent 1 Crore On NTR Andhrawala Audio Function

చంద్రబాబు మూడు కిలోమీటర్ల ప్రయాణించడానికి 5 గంటల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు రావి వెంకటేశ్వరరావు, రాము, ఎన్టీఆర్ తనయుడు నలుగురు ఒకే సామాజిక వర్గం వారు ఉన్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడ అంటే అన్ని సామాజిక వర్గాలు.. అందరూ కలిసి ఉండే ప్రాంతం. ఈ నలుగురు రావటానికి ఇదేమైనా కమ్మ సంఘం సమావేశం అని ప్రశ్నించారు. ఇదే సమయంలో చంద్రబాబు గుడివాడలో తనపై చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని ఖండించారు. తనని ఓడించాలని ఎప్పటినుండో ట్రై చేస్తున్నారు. 2024లో కూడా తానే గెలుస్తానని కొడాలి నాని స్పష్టం చేశారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది