Kodali Nani : నేను బతికున్నంత వరకు గుడివాడలో ఇదే రిపీట్ అవుద్ది.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యల వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kodali Nani : నేను బతికున్నంత వరకు గుడివాడలో ఇదే రిపీట్ అవుద్ది.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యల వీడియో వైరల్..!!

Kodali Nani : వైసీపీ రాష్ట్ర యువజన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొడాలి నాని గురించి మాట్లాడుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. నాని అన్నా అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు. వైసీపీ పార్టీపై ఈగ వాళ్లనివ్వకుండా కౌంటర్లు ఇచ్చే కొడాలి నానిని కాపాడుకోవడం వైసీపీ యువజన విభాగంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా తెలిపారు. ఇక ఇదే సమయంలో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :8 March 2023,10:20 am

Kodali Nani : వైసీపీ రాష్ట్ర యువజన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొడాలి నాని గురించి మాట్లాడుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. నాని అన్నా అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు. వైసీపీ పార్టీపై ఈగ వాళ్లనివ్వకుండా కౌంటర్లు ఇచ్చే కొడాలి నానిని కాపాడుకోవడం వైసీపీ యువజన విభాగంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా తెలిపారు. ఇక ఇదే సమయంలో కొడాలి నాని మాట్లాడుతూ… తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు గుడివాడలో ఎగిరేది వైసీపీ జెండా అని తెలియజేశారు.

Kodali Nani Speech YSP flag has flown at Gudivada

Kodali Nani Speech  YSP flag has flown at Gudivada

నేను బతికున్నంత వరకు ఇదే రిపీట్ అవుద్ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు మరియు లోకేష్ పై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరికీ ప్రజల మరియు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని… తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్ర పై కూడా సెటైర్లు వేయడం జరిగింది. లోకేష్ పాదయాత్రకి పోటీగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెళ్ళితే అతనికంటే సిద్ధార్థకి ఎక్కువ జనాలు వస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎక్కువ

Kodali Nani Speech YSP flag has flown at Gudivada

Kodali Nani Speech  YSP flag has flown at Gudivada

దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం తాను వాళ్ళు చేసే కుట్రలను బయట పెట్టడం వల్లే అని తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికల్లో ఐదోసారి గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో  గెలుస్తానని….అన్నారు. ఇదే సమయంలో గుడివాడ నియోజకవర్గం నుండి దమ్ముంటే లోకేష్ లేదా చంద్రబాబు… తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. లేకపోతే ఒకరు గుడివాడ మరొకరు గన్నవరం తనమీద వంశీ మీద పోటీ చేసి గెలవాలని… చాలెంజ్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా తాను బతికున్నంత కాలం రెపరెపలాడుతుందని కొడాలి నాని స్పీచ్ ఇచ్చారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది