Kodali Nani Speech YSP flag has flown at Gudivada
Kodali Nani : వైసీపీ రాష్ట్ర యువజన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొడాలి నాని గురించి మాట్లాడుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. నాని అన్నా అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు. వైసీపీ పార్టీపై ఈగ వాళ్లనివ్వకుండా కౌంటర్లు ఇచ్చే కొడాలి నానిని కాపాడుకోవడం వైసీపీ యువజన విభాగంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా తెలిపారు. ఇక ఇదే సమయంలో కొడాలి నాని మాట్లాడుతూ… తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు గుడివాడలో ఎగిరేది వైసీపీ జెండా అని తెలియజేశారు.
Kodali Nani Speech YSP flag has flown at Gudivada
నేను బతికున్నంత వరకు ఇదే రిపీట్ అవుద్ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు మరియు లోకేష్ పై కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరికీ ప్రజల మరియు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని… తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్ర పై కూడా సెటైర్లు వేయడం జరిగింది. లోకేష్ పాదయాత్రకి పోటీగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెళ్ళితే అతనికంటే సిద్ధార్థకి ఎక్కువ జనాలు వస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎక్కువ
Kodali Nani Speech YSP flag has flown at Gudivada
దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం తాను వాళ్ళు చేసే కుట్రలను బయట పెట్టడం వల్లే అని తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికల్లో ఐదోసారి గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని….అన్నారు. ఇదే సమయంలో గుడివాడ నియోజకవర్గం నుండి దమ్ముంటే లోకేష్ లేదా చంద్రబాబు… తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. లేకపోతే ఒకరు గుడివాడ మరొకరు గన్నవరం తనమీద వంశీ మీద పోటీ చేసి గెలవాలని… చాలెంజ్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా తాను బతికున్నంత కాలం రెపరెపలాడుతుందని కొడాలి నాని స్పీచ్ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.