Chandrababu : బీజేపీతో పొత్తుకి ప్లాన్ చేసిన చంద్రబాబుకి కొమ్మినేని స్ట్రాంగ్ ప్రశ్నలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : బీజేపీతో పొత్తుకి ప్లాన్ చేసిన చంద్రబాబుకి కొమ్మినేని స్ట్రాంగ్ ప్రశ్నలు..!

Chandrababu : 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర నాది. రాజకీయాల్లో ఈ దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు ఎవరూ లేరు అంటూ గప్పాలు కొట్టే చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. అసలు 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవడం కాదు.. దేశ ప్రధాని అవడం ఆయన టార్గెట్. దేశ ప్రధాని అవడం కోసం.. బీజేపీని పక్కన పెట్టి.. థర్డ్ ఫ్రంట్ పేరుతో ఏదేదో చేయబోయారు కానీ.. అదేదీ వర్కవుట్ కాలేదు. 2019 […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 April 2023,10:00 pm

Chandrababu : 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర నాది. రాజకీయాల్లో ఈ దేశంలో నాకంటే సీనియర్ నాయకుడు ఎవరూ లేరు అంటూ గప్పాలు కొట్టే చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. అసలు 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవడం కాదు.. దేశ ప్రధాని అవడం ఆయన టార్గెట్. దేశ ప్రధాని అవడం కోసం.. బీజేపీని పక్కన పెట్టి.. థర్డ్ ఫ్రంట్ పేరుతో ఏదేదో చేయబోయారు కానీ.. అదేదీ వర్కవుట్ కాలేదు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు.. ప్రధాని మోదీతో కటీఫ్ చెప్పారు.

ఆ తర్వాత సడెన్ గా రంగులు మార్చేసి తాజాగా మాట్లాడారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తుతున్నారు. మోదీకి సంస్కారం లేదన్నారు అప్పుడు. ఆయన మోసాల మోదీ అన్నారు. మోదీ హటావో.. మోదీని దింపేస్తాం.. అంటూ తీవ్రంగా చంద్రబాబు మోదీని విమర్శించారు. ఇప్పుడు మాట మార్చి.. ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తుతున్నారు చంద్రబాబు. అయితే.. గతంలో మోదీని కేవలం ఏపీకి ప్రత్యేక హోదా అంశంలోనే వ్యతిరేకించారట చంద్రబాబు.

kommineni comments on chandrabau who is trying close with modi

kommineni comments on chandrabau who is trying close with modi

 

Chandrababu : చంద్రబాబు గాలానికి బీజేపీ చిక్కుతుందా?

మోదీ ప్రపంచంలోనే అతి గొప్ప నేత అంటూ చంద్రబాబు ఇప్పుడు పొగుడుతున్నారు. ఎన్డీఏలో చేరడానికి తాము రెడీ అన్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. తాను ఏనాడూ మోదీ విధానాలను వ్యతిరేకించలేదంటూ స్పష్టం చేశారు. పార్టీలు వేరు అయినా కూడా తాను నేషన్ ఫస్ట్ అని భావిస్తా అంటూ చెప్పుకొచ్చారు. అదేంటి.. అప్పుడేమో అలా తిట్టి.. ఇప్పుడేమో ఇలా పొగుడుతున్నారు. బీజేపీలో చేరడం కోసం.. బీజేపీతో జతకట్టడం కోసం చంద్రబాబు వేస్తున్న వేషాలు ఇవన్నీ. వీటిని బీజేపీ పరిగణనలోకి తీసుకుంటుందా? చంద్రబాబు గాలానికి చిక్కుతుందా? అని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది