
congress party
తెలంగాణలో త్వరలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనిని అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే.. వీరి మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా తగుదునమ్మా అంటూ.. పోటీ పడుతోంది. వాస్తవానికి ఏడు ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కలేదు. పైగా.. ఇక్కడ కాంగ్రెస్ బలం అంతా కూడా టీఆర్ఎస్‌కు మూకుమ్మడిగా వెళ్లిపోయింది.
మరోమాటలో చెప్పాలంటే.. అసలు ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు కూడా లేరు. అయినప్పటికీ.. ఇప్పుడు.. ఇంత ఉత్కంఠ పోరులో.. కాంగ్రెస్ పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. సహజంగానే.. ఎన్నికలన్నాక పోటీ చేయాలి కాబట్టి చేస్తుందని అనుకున్నా.. అదేసమయంలో అంతే కీలకంగా ఉన్న మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖను ఇక్కడ నుంచి పోటీకి దింపాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం.. కాంగ్రెస్‌కు బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా చూసుకుంటే.. సురేఖకు గొప్ప ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.
telangana-congress
కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసిందని వార్తలు వస్తున్నాయి. త్వరలో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. వాస్తవానికి సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ ఇక్కడ పోటీకి పరిశీలించింది. అయితే అంతిమంగా సురేఖ పేరును ఆ పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు.
అయితే ఈటల సగం బీసీ, సగం ఓసీ అంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. టీఆర్‌ఎస్ ఇలా ప్రచారం చేయడమే కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హుజురాబాద్ నుంచి బరిలోకి దింపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు జిల్లాలో విద్యార్థి నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అటు దళిత బంధు పథకంతో ఆ వర్గం ఓట్లను.. ఇటు గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీసీల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌ఎస్ ఆశ పెట్టుకుంది.
Konda Surekha likely to field in Huzurabad bypoll
ఇక సురేఖను పోటీలో నిలబెట్టడానికి కాంగ్రెస్‌కు ఓ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలా అంటే సురేఖ భర్త కొండా మురళీది మున్నూరు కాపు సామాజిక వర్గం. సురేఖది పద్మశాలి సామాజిక వర్గం. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని అంచనాతో ఉంది. ఇక తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది.
ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్‌గా మారింది. దీంతో ఆచితూచి సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్ వ్యూహం ఇలా ఉంటే.. మేధావుల మాటేంటంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో హుజూరాబాద్ నుంచి సురేఖ నిలబడ్డా.. గెలుపు గుర్రం ఎక్కలేరని.. ఈటల వర్సెస్ టీఆర్ఎస్‌కే ప్రధాన పోరు ఉంటుందని.. సో.. వేరే వారికి ఈ టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఓడిపోయినా.. నేతలను సంతృప్తి పరిచారనే వాదన ఉంటుందని అంటున్నారు. దీంతో ఓడిపోయే టికెట్‌ను తీసుకోవడం కూడా సురేఖకు మంచిది కాదని సూచిస్తున్నారు. మరి ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.