Konda Surekha | కేబినెట్ మీటింగ్‌కి హాజరుకానున్న కొండా సురేఖ .. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Konda Surekha | తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల తన ఓఎస్‌డీని ప్రభుత్వం టర్మినేట్ చేయడం, ఆ తర్వాత పోలీసులు బుధవారం రాత్రి ఆలస్యంగా ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ ప్రయత్నం చేయడం వంటి పరిణామాల వల్ల సురేఖ తీవ్ర అసంతృప్తికి గురయ్యారనే వార్తలు వెలువడ్డాయి. ఈ కారణంగా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి ఆమె హాజరుకావట్లేదని ప్రచారం చెలామణి అయింది.
#image_title
ఊహించని నిర్ణయం..
అయితే, తాజా సమాచారం ప్రకారం సురేఖ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. చివరకు కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారని సన్నిహితులు వెల్లడించారు. ఆమె నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు, కొండా సురేఖ పరిస్థితిపై సహచర మంత్రులు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సురేఖ హాజరుతో ఈరోజు కేబినెట్ సమావేశం మరింత ఆసక్తికరంగా మారనుంది.
సీఎం సహా రెడ్డి మంత్రులందరనీ టార్గెట్ చేస్తూ కూతురు కొండా సుస్మితా అటు ఘాటు వ్యాఖ్యలు చేశారు బీసీల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు? ఈ సమస్యపై మంత్రి వర్గం స్పందన ఎలా ఉంటుంది? జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.