Chiranjeevi : సినిమా షూటింగ్‌లంటే ఒకప్పుడు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలవైపే చూసే వారు మేకర్స్. అసలు సినిమాలంటేనే అక్కడే చిత్రీకరిస్తారనే వరకు వెళ్లింది వ్యవహారం. అయితే తెలంగాణలో షూటింగ్ అంటే ఏ దర్శక నిర్మాతలు కూడా మొగ్గు చూపేవారు కాదు. హైద్రాబాద్ మినహా మిగతా తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరూ కూడా షూటింగ్‌కు అడుగుపెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మేకర్స్ ఇప్పుడు తెలంగాణలోని విశిష్ట ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు సన్నద్దమవుతున్నారు.
శేఖర్ కమ్ముల ఆల్రెడీ ఫిదా తీశాడు. నిజామాబాద్ అందాలను మళ్లీ లవ్ స్టోరీ సినిమాలో పెట్టబోతోన్నాడు. సంపత్ నది ఓదెల రైల్వేస్టేషన్ అంటూ మొత్తం షూటింగ్‌నే జరుపుతున్నాడు. ఇక సలార్ వంటి పాన్ ఇండియన్ సినిమా కూడా తెలంగాణలోనే మొదలైంది. సింగరేణి గనుల్లో ఈ మూవీ షూటింగ్ మొదలవ్వడంతో అందరి చూపు ఇటు వైపు పడింది. దాదాపు పది రోజులు కంటిన్యూగా షూటింగ్ చేసుకుంది సలార్ చిత్రయూనిట్.
సింగరేణి బొగ్గు గనులను ఇప్పుడు షూటింగ్ స్పాట్స్ మేకర్స్ ఎంచుకుంటున్నారు. తాజాగా కొరటాల శివ కూడా ఇదే రకమైన ప్లాన్ వేశాడట. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ వచ్చే నెల 7వ తేదీ నుంచి 15వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని జేకే మైన్స్‌లో జరగనుంది. షూటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ దర్శకుడు కొరటాల శివ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిశారు. ఇల్లెందులోని జేకే బొగ్గు గనుల్లోని ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లో ‘ఆచార్య’ సినిమా కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశామని కొరటాల మంత్రికి చెప్పారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి చిత్రం షూటింగ్‌కు స్థానికంగా అనుమతులు ఇప్పించటంతో పాటు హీరో చిరంజీవికి తన నివాసంలో ఆతిధ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడట.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.