Chiranjeevi : అప్పుడు ప్రభాస్ ఇప్పుడు చిరంజీవి.. బొగ్గుగునులపై కన్ను! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : అప్పుడు ప్రభాస్ ఇప్పుడు చిరంజీవి.. బొగ్గుగునులపై కన్ను!

 Authored By bkalyan | The Telugu News | Updated on :13 February 2021,9:30 pm

Chiranjeevi : సినిమా షూటింగ్‌లంటే ఒకప్పుడు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలవైపే చూసే వారు మేకర్స్. అసలు సినిమాలంటేనే అక్కడే చిత్రీకరిస్తారనే వరకు వెళ్లింది వ్యవహారం. అయితే తెలంగాణలో షూటింగ్ అంటే ఏ దర్శక నిర్మాతలు కూడా మొగ్గు చూపేవారు కాదు. హైద్రాబాద్ మినహా మిగతా తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరూ కూడా షూటింగ్‌కు అడుగుపెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మేకర్స్ ఇప్పుడు తెలంగాణలోని విశిష్ట ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు సన్నద్దమవుతున్నారు.

శేఖర్ కమ్ముల ఆల్రెడీ ఫిదా తీశాడు. నిజామాబాద్ అందాలను మళ్లీ లవ్ స్టోరీ సినిమాలో పెట్టబోతోన్నాడు. సంపత్ నది ఓదెల రైల్వేస్టేషన్ అంటూ మొత్తం షూటింగ్‌నే జరుపుతున్నాడు. ఇక సలార్ వంటి పాన్ ఇండియన్ సినిమా కూడా తెలంగాణలోనే మొదలైంది. సింగరేణి గనుల్లో ఈ మూవీ షూటింగ్ మొదలవ్వడంతో అందరి చూపు ఇటు వైపు పడింది. దాదాపు పది రోజులు కంటిన్యూగా షూటింగ్ చేసుకుంది సలార్ చిత్రయూనిట్.

Koratala siva Chiranjeevi Acharya shoot in coal mines

Koratala siva Chiranjeevi Acharya shoot in coal mines

Chiranjeevi : అప్పుడు ప్రభాస్ ఇప్పుడు చిరంజీవి..

సింగరేణి బొగ్గు గనులను ఇప్పుడు షూటింగ్ స్పాట్స్ మేకర్స్ ఎంచుకుంటున్నారు. తాజాగా కొరటాల శివ కూడా ఇదే రకమైన ప్లాన్ వేశాడట. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ వచ్చే నెల 7వ తేదీ నుంచి 15వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని జేకే మైన్స్‌లో జరగనుంది. షూటింగ్‌ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ దర్శకుడు కొరటాల శివ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిశారు. ఇల్లెందులోని జేకే బొగ్గు గనుల్లోని ఓపెన్‌కాస్ట్‌, అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌లో ‘ఆచార్య’ సినిమా కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశామని కొరటాల మంత్రికి చెప్పారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి చిత్రం షూటింగ్‌కు స్థానికంగా అనుమతులు ఇప్పించటంతో పాటు హీరో చిరంజీవికి తన నివాసంలో ఆతిధ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడట.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది