Kotamreddy Sridhar Reddy : అసెంబ్లీలో రచ్చ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… వీడియో వైరల్..!!

Advertisement

Kotamreddy Sridhar Reddy : రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో చాలా సందర్భాలలో అసెంబ్లీ స్పీకర్ పోడియం వద్దకు కోటంరెడ్డి దూసుకెల్లడం జరిగింది. పదేపదే పెద్దగా కేకలు వేస్తూ స్పీకర్ పోడియం వద్ద దూసుకెళుతు నానా హంగామా చేశారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ అయ్యారు.

Kotamreddy Sridhar Reddy Overaction In Front Of Ys Jagan
Kotamreddy Sridhar Reddy Overaction In Front Of Ys Jagan

కోటంరెడ్డి, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ లను ఈ సెషన్  మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే మిగిలిన సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సభ తప్పుదోవ పట్టించే రీతిలో సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డు తగులుతున్నందుకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అయినా గాని పోడియం వద్ద కోటంరెడ్డి రచ్చ చేయటంతో

Advertisement
Kotamreddy Sridhar Reddy Overaction In Front Of Ys Jagan
Kotamreddy Sridhar Reddy Overaction In Front Of Ys Jagan

మార్చల్స్ ఆయన్ని ఎత్తి అసెంబ్లీ వెలుపలకి తీసుకెళ్లడం జరిగింది. అసెంబ్లీలో కోటంరెడ్డి తీరు మొత్తం రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోటంరెడ్డి పై వైసీపీ ఎమ్మెల్యేలు అంబాటి రాంబాబు మరి కొంతమంది సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కోటంరెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తగా… రాతపూర్వకంగా సమస్యల అంశాలను ఇచ్చినట్లయితే పరిశీలిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement