Malla Reddy : కేటీఆర్, హరీశ్ రావు ముందు అడ్డంగా దొరికిపోయిన మంత్రి మల్లారెడ్డి.. ఎట్ల ఆడుకున్నరో చూడండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Malla Reddy : కేటీఆర్, హరీశ్ రావు ముందు అడ్డంగా దొరికిపోయిన మంత్రి మల్లారెడ్డి.. ఎట్ల ఆడుకున్నరో చూడండి

 Authored By kranthi | The Telugu News | Updated on :2 March 2023,6:00 pm

Malla Reddy : మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. పూలు అమ్మిన.. పాలు అమ్మిన.. కేసీఆర్ నా గుండె కాయ. కేటీఆర్ నా దేవుడు. ఇలా.. మల్లారెడ్డి ఏం మాట్లాడినా చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రతి దాంట్లో మనమే నెంబర్ వన్. మన సీఎం నెంబర్ వన్ అంటాడు. ఇక ఆయన మాట్లాడటం మొదలు పెడితే అలాగే ఉంటుంది. అయితే.. ఇటీవల సీపీఆర్ ట్రెయినింగ్ ను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మధ్య జనాలకు బాగా హార్ట్ ఎటాక్స్ వస్తుండటంతో పోలీసులకు, ఫ్రంట్ లైన్ సిబ్బంది

Harish Rao And KTR Making Fun With Malla Reddy

Harish Rao And KTR Making Fun With Malla Reddy

, ఇతర అధికారులకు సీపీఆర్ మీద ట్రెయినింగ్ ఇస్తున్నారు. గుండె పోటు వచ్చిన వాళ్లకు ఎలా సీపీఆర్ చేయాలో ట్రెయినింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కు మంత్రి కేటీఆర్, హరీశ్ రావు, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావును మాట్లాడాలని వాళ్లు కోరుతారు. దీంతో మంత్రి కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ కలిసి మంత్రి మల్లారెడ్డి గారు మీరు వెళ్లి మాట్లాడండి అంటారు కేటీఆర్.సార్.. మీరు ఉన్నారు కదా. నేనెందుకు మాట్లాడటం అంటారు మంత్రి మల్లారెడ్డి.

Minister Malla Reddy COMEDY At CPR Training Program | KTR | Harish Rao |  Qubetv News - YouTube

Malla Reddy : నువ్వు మాట్లాడకపోతే ఎట్లా.. అన్న కేటీఆర్

దీంతో మీరు మాట్లాడకపోతే ఎట్లా.. అంటారు కేటీఆర్. హరీశ్ రావు కూడా వెళ్లి మాట్లాడమంటారు. సార్ నేనెందుకు సార్.. అని మల్లారెడ్డి అన్నా కూడా మల్లారెడ్డి గారికి చప్పట్లు అంటూ ఎంకరేజ్ చేస్తారు కేటీఆర్. దీంతో చేసేదేం లేక మల్లారెడ్డి స్టేజ్ మీదికి వెళ్లి మాట్లాడుతారు. అక్కడ కూడా మన సీఎం నెంబర్ వన్, మనమే నెంబర్ వన్ అని ఒక రెండు మూడు నిమిషాలు గప్పాలు కొట్టి ఆ తర్వాత తన ప్రసంగాన్ని ముగిస్తారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది