
KTR : ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేమేంటో చూపిస్తాం .. రేవంత్ రెడ్డికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్..!
హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తారనే పేరున్న తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలోనే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారు. నెటిజన్లు కేటీఆర్ ను ఆటాడుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి… తప్పుడు ట్వీట్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారిన గిరిజన బాలిక దారుణ హత్యాచారం ఘటనకు సంబంధించిన విషయం కావడంతో విపక్షాలు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
వినాయక చవితి ముందు రోజు సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. ఆరేండ్ల చిన్నారిపై లైగింక దాడికి పాల్పడి దారుణంగా చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. అయితే చిన్నారి హత్యపై స్పందిస్తూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఘటన అత్యంత బాధాకరమంటూ ఈనెల 12న ట్వీట్ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు రచ్చ రచ్చవుతోంది.
telangana minister ktr childhood photo goes viral
ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఇంకా పోలీసులకు దొరకలేదు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఫలితం దక్కడం లేదు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులే ప్రకటించారు. అంతేకాదు నిందితుడిని పట్టిస్తే 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో కేటీఆర్ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితుడు ఎక్కడ మంత్రిగారూ? అతడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శిస్తున్నారు.
వ్యసనపరులకు తెలంగాణ స్వర్గథామంగా నిలించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా మంత్రి కేటీఆర్ ఐదు రోజుల క్రితమే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఐదు రోజుల తర్వాత నిందితుడు రాజు ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారని రేవంత్ ప్రస్తావించారు. కేటీఆర్ స్పృహలో ఉండే ఈ ట్వీట్ చేశారా అని ఆయన ప్రశ్నించారు.
KTR Birthday Special Story
మంత్రి కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. నిందితుడి అరెస్టుపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా ట్వీట్ చేశానని విచారం వ్యక్తం చేశారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారని తెలిపారు. నిందితుణ్ని త్వరగా పట్టుకుని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అందరం కృషి చేద్దామని పేర్కొన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్… నెటిజన్లకు టార్గెట్ కావడం ఆసక్తిగా మారింది. అసలు పోలీసుల నుంచి సమాచారం లేకుండానే నిందితుడిని పట్టుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేయడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఈ అంశంలోనే కేటీఆర్ ను మరింత ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో కేటీఆర్ అనుచరులతో పాటు టీఆర్ఎస్ కేడర్ లో మాత్రం నిస్తేజం అలుముకుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.