KTR Missing Trolling in social media
KTR తెలంగాణలో అతి భారీ వర్షాలు. హైదరాబాద్‌లో కుండపోత వాన. కేసీఆర్ KCR ప్రభుత్వం ఏకంగా ఒకరోజు సెలవు కూడా ఇచ్చేసింది. వరద ఉధృతి కారణంగా భాగ్యనగరంలోని ముషారాంబాగ్ బ్రిడ్జిని సైతం మూసేశారు. ముసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ముసీ గట్టు మీద ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎప్పటిలానే లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మూడు రోజులుగా నరకం చూస్తున్నారు జనాలు. మరి, ఇంత జరిగితే పట్టణశాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడ?
KTR Missing Trolling in social media
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించరేం? గతంలో హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ నగరంలో విస్తృతంగా చక్కర్లు కొట్టారు. కుటుంబానికి 10వేలు కూడా ఇచ్చారు. అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో అలా చేశారంటూ అంతా విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఇటు వైపు కూడా చూడటం లేదంటూ హైదరాబాదీలు మండిపడుతున్నారు. ఇక జిల్లాల్లోనూ ఇదే తీరుగా ఉంది పరిస్థితి. తన సొంత ఇలాఖా సిరిసిల్ల నీటమునిగితే వెళ్లి చూశారు కానీ.. మిగతా జిల్లాలు జలమయమైతే పట్టించుకోరా అంటూ మంత్రి కేటీఆర్‌ను నిలదీస్తున్నారు బాధితులు.
ఇక భాగ్యనగర వాసులు మరో అడుగు ముందుకేసి.. తమదైన స్టైల్‌లో నిరసన తెలిపారు. కేటీఆర్ మిస్సింగ్ అంటూ వరద ముంపు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. ఎక్కడ వరద ఉంటే అక్కడ కేటీఆర్ మిస్సింగ్ అనే వాల్ పోస్టర్లు దర్శనమిస్తుండటం అధికార పార్టీని కలవర పరుస్తోంది. పోనీ, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిద్దామా అంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంకెన్నాళ్లీ దుస్థితి అంటూ నిలదీసే పరిస్థితి ఉంది. అందుకే మంత్రి కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు. ఆయన రాకపోయేసరికి కేటీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లతో తమ నిరసన తెలుపుతున్నారు వరద బాధితులు. గతేడాది వరదలకు నానా ఇబ్బందులు పడ్డామని, ఈసారి అదే పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. దీనికి టీ సర్కార్ .. పరిష్కారం చూడటం లేదంటూ వీరంతా తమ ఆవేదనను ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ktr speaks to media in warangal about govt jobs
మరికొందరు ఆ పోస్టర్లకు వరద విజువల్స్ కూడా జత చేసి.. మీమ్స్‌తో వీడియోలు రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అవి తెగ వైరల్ అవుతుండటంతో కేటీఆర్ ఫుల్‌గా బద్నామ్ అవుతున్నారు. పోతే ఓ లొల్లి. పోకపోతే ఇంకో లొల్లి. ఇదేందిబై అంటూ కేటీఆర్ ప్రగతి భవన్ వీడి బయటకు రావట్లేదని అంటున్నారు. ఏదేమైనా వరదల్లో భాగ్యనగరం అతలాకుతలం అవుతుంటే, పట్టణ శాఖ మంత్రిగా ఉండి, కనీసం పట్టించుకోవడం లేదన్న ఆవేదన, ఆగ్రహం ప్రతిరూపమే ఈ వాల్ పోస్టర్లు, మీమ్స్ .. అని టాక్ నడుస్తోంది. కానీ ఈ సమస్య కేటీఆర్ శాఖకు చెందిందే, అయినా, పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తేనే, ఏమైనా చేయగలమన్నది.. అదేమీ .. అంత ఆషామాషీ కాదని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై టీ సర్కార్ ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అడుగులు వేస్తేనే, పరిష్కారం అవుతుందన్న విషయం తెలిసిందే.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.