KTR : కేటీఆర్ తన జీవితంలో ఒక్కసారి కూడా సీఎం కాలేడు?
KTR : మొన్నటి దాకా.. తెలంగాణలో కేటీఆర్ సీఎం అనే జపమే నడిచింది. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. అంటూ టీఆర్ఎస్ మంత్రులు బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేసేసరికి.. ఏకంగా పెద్ద సారు సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. ఇంకో పదేళ్లు నేను ముఖ్యమంత్రగా ఉంటా.. అంటూ ప్రకటించేశారు. దీంతో కేటీఆర్ సీఎం అనే ప్రచారాలకు బ్రేక్ పడింది.
సరే.. ఇప్పుడు కాకుంటే మరెప్పుడైనా ముఖ్యమంత్రి అవుతారుగా. కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా అంతటి రాజకీయ పరిణతి కలిగిన నేత కేటీఆర్. దాంట్లో డౌటే లేదు. అందుకే.. కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అధినాయకత్వం వహించాల్సిన బాధ్యత కేటీఆర్ మీదుంది. అందుకే.. ఇప్పుడు కాకపోతే.. తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారు కదా.. అని అంతా సైలెంట్ అయిపోయారు.
కట్ చేస్తే… అసలు.. ఇప్పుడు కాదు.. ఈ జన్మలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరట. అంతటి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా? బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ప్రభాకర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
KTR : కేసీఆర్ కు సవాల్ విసిరిన ప్రభాకర్
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని.. కేటీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ పార్టీ నేతల్లోనే సరైన బంధాలు లేవు. వాళ్లలోనే ఎన్నో గొడవలు.. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించడం కోసం కేటీఆర్ పనిచేస్తున్నారు. మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిలు మాత్రం వాణీదేవిని గెలిపించడం కోసం పని చేస్తున్నారు. క్యాడరే సరిగ్గా లేదు. ఇంకా వీళ్లు ప్రజలకేం చెబుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.. కేసీఆర్, కేటీఆర్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే.. అంటూ ప్రభాకర్ స్పష్టం చేశారు.