చెట్టుకి ఉరి…13 ఏళ్ల బాలికపై అత్యాచారం..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: July 16, 2023, 1:18 pm

దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు చట్టాలు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా గాని మగాడి బుద్ధిలో మాత్రం మార్పు రావడం లేదు. భారతదేశవ్యాప్తంగా రోజురోజుకీ అత్యాచార కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అత్యాచారం చేసి ఆడపిల్లని అతికిరాతకంగా చంపేస్తున్నారు. రాక్షసులు మాదిరిగా భారతదేశంలో ఆడపిల్లల పట్ల వ్యవహరిస్తున్నారు. కఠినమైన శిక్షలు.. పడుతున్న గాని ఏమాత్రం పరిస్థితులలో మార్పులు రావడం లేదు. తాజాగా 13 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి.. చివరికి చెట్టుకు ఉరేసి చంపేశారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం కర్ణాటక బోర్డర్ లో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన గెలకసూరు క్యాంపులో దారుణం చోటుచేసుకుంది. బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన 13 ఏళ్ల చిన్నారిపై ముగ్గురు యువకులు.. అత్యాచారానికి పాల్పడ్డారు. హత్య చేసి చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఆ 13 ఏళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి చిల్లర వ్యాపారం చేస్తూ ఊరూరా తిరుగుతూ ఉంటది. గురువారం మధ్యాహ్నం పని ముగించుకుని తల్లిదండ్రుల కంటే ముందుగానే ఇంటికి చేరుకోవడం జరిగింది. అదే అదునుగా చేసుకున్న పక్కింటి యువకులు..

బాలికకు మాయ మాటలు చెప్పి పొలాల్లోకి ఎత్తుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు వస్తుందన్నే ఉద్దేశంతో.. హత్య చేయాలనుకున్నారు. ఈ క్రమంలో చున్నీతో చెట్టుకు ఉరేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆ చిన్నారి ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించారు. అయితే బాలిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులకు.. అనుమానం రావటంతో కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్ని దర్యాప్తు చేపట్టి.. యువకులను పట్టుకోగా ఒకడు పారారిలో ఉండటం జరిగింది. అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించుకుని ఇప్పుడు ఆ ఇద్దరి యువకులను విచారిస్తూ ఉన్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp