Kurnool Sravan Kumar Case : అత్తా మామలు కలిసి సున్తీ చేయించారని పగబట్టిన అల్లుడు…కట్ చేస్తే కటకటాల పాలయ్యాడు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kurnool Sravan Kumar Case : అత్తా మామలు కలిసి సున్తీ చేయించారని పగబట్టిన అల్లుడు…కట్ చేస్తే కటకటాల పాలయ్యాడు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :20 March 2023,10:00 am

Kurnool Sravan Kumar Case : సమాజంలో కుటుంబ బంధాలు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. ఆస్తిపాస్తుల కోసం రక్తసంబందులైన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య గొడవలు మరో పక్క భార్యాభర్తల మధ్య అనుమానాలతో కూడిన అక్రమ సంబంధాలతో ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువ భార్యాభర్తల గొడవలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ పెరిగిపోవటంతో అనేక అనుమానాలతో భార్యాభర్తలు ఎవరికి వారు గొడవలకు దిగి కుటుంబాలను బజారుకీడుస్తున్నారు. ఈ రకంగానే కర్నూలు జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన రుక్మిణి అనే అమ్మాయిని కర్నూలు జిల్లా కి చెందిన శ్రావణ్ కుమార్ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లికి ముందు నిశ్చితార్థం జరిగిన తర్వాత … తనకు కాబోయే భార్య రుక్మిణికి సెల్ ఫోన్ కొనివ్వడం జరిగింది.

ఇద్దరు తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళు. నిశ్చితార్థం తర్వాత ఒకరిని మరొకరు చాలా ఇష్టపడటం జరిగింది. దీంతో శ్రావణ్ కుమార్ గంటలకు తన కాబోయే భార్యతో ఫోన్లో మాట్లాడేవారు. అయితే తనకు కాబోయే భార్యకి ఫోన్ చేసిన క్రమంలో… కొన్నిసార్లు బిజీ రావటంతో పెళ్లికి ముందే అనుమానం పెంచుకోవడం జరిగింది. అది కూడా సమయం కాని సమయంలో రావటంతో.. చాలా అనుమానం పెరిగిపోయింది. అయితే ఒకసారి కాబోయే భార్య రుక్మిణి కలిసి ఆమె ఫోనులో … ఆమెకు తెలియకుండా ట్రాకింగ్ రికార్డింగ్ యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కి వచ్చే కాల్స్ మొత్తం శ్రావణ్ కుమార్ జిమెయిల్ కీ కనెక్ట్ చేసే తరహాలో మొత్తం ప్లాన్ చేశారు. ఈ క్రమంలో రుక్మిణి ఆమె జిల్లాకే చెందిన ఒక యువకుడితో ఆమెకు సంబంధం ఉన్నట్లు శ్రావణ్ కుమార్ గుర్తించాడు.

kurnool sravan kumar case viral in social media

kurnool sravan kumar case viral in social media

అతని పేరు రాఘవేంద్ర గౌడ్ అని గుర్తించాడు. అయితే పెళ్లి టైంలో గొడవలు ఎందుకులే అని తర్వాత.. మొత్తం తెలుసుకోవచ్చు అని శ్రావణ్ మార్చ ఒకటో తారీఖున పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండు మూడు రోజుల శోభనం జరిగిపోయింది. ఫస్ట్ నైట్ తర్వాత శ్రావణ్ కుమార్ ప్రైవేట్ పార్ట్ కీ ఇన్ఫెక్షన్ రావడంతో… వైద్యులను కలిశారు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని అనటంతో హైదరాబాదులో రుక్మిణి తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించడం జరిగింది. శ్రావణ్ కుమార్ కి సున్తీ చేశారు. అయితే తనకి ఈ వ్యాధి రావడానికి కారణం భార్య అని ఆమె రహస్యంగా మాట్లాడిన ఫోన్ కాల్ వ్యవహారం ఎత్తి శ్రావణ్ గొడవకు దిగాడు. దీంతో రుక్మిణి తల్లిదండ్రులు ఎందుకు అంత అనుమానం అని అల్లుడిపై మండిపడ్డారు. అయితే తన కొడుక్కి కి సున్తీ చేయించడంతో శ్రావణ్ తండ్రి.. వరప్రసాద్..

రుక్మిణి తల్లిదండ్రులపై గొడవకు దిగారు. తన కొడుకుకి వంశపార్యపరం లేకుండా సంతానం కలగకుండా వ్యవహరించారని ఊగిపోయారు. దీంతో శ్రావణ్ కుమార్ తండ్రి వరప్రసాద్ ఇద్దరూ కలిసి.. రుక్మిణి తల్లిదండ్రులను చంపడానికి స్కెచ్ వేశారు. దీనిలో భాగంగా రుక్మిణి తో పాటు ఆమె తల్లిదండ్రులను కర్నూలుకి పిలిపించారు. ఈ క్రమంలో ఇంటిలోకి వచ్చాక శ్రావణ్ కుమార్ తన తల్లి కృష్ణవేణి నీ ఇంటి గేటు బయట కాపలాగా ఉంచారు. దీంతో ఇంట్లో ఉన్న రుక్మిణి మరియు ఆమె తల్లిదండ్రులను… ఒక్క ప్లానింగ్ ప్రకారం కత్తులు తెచ్చుకున్న తండ్రి కొడుకులు దాడులకు తెగపడ్డారు. మొదట భార్య రుక్మిణినీ పై అంతస్తులోకి తీసుకెళ్లి శ్రావణ్ కుమార్ చంపేశాడు. ఆ తర్వాత ఆమె తల్లిపై

దాడికి పాల్పడ్డారు ఆమె కూడా మరణించడం జరిగింది. ఏదో శబ్దం రావటంతో రుక్మిణి తండ్రి వెంకటేశ్వరరావు పైకి వెళ్లాలని ప్రయత్నించగా అతనిపై కూడా దాడికి పాల్పడగా అతడు తప్పించుకుని గాయాలతో బయటపడ్డాడు. గేటు దగ్గర ఉన్న కృష్ణవేణిని తప్పించుకుని గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు వచ్చి అతన్ని కాపాడి రక్తస్రావం కాకుండా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే రుక్మిణి మరియు ఆమె తల్లి మరణించడంతో.. శ్రావణ్ కుమార్ అతని తల్లిదండ్రులు బైక్ మీద ముగ్గురు కలిసి పారిపోయారు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయినా.. వెంకటేశ్వర్లు కూతురు భార్య చనిపోయిందని కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి… శ్రావణ్ కుమార్ అతని తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్ కీ తరలించారు. హత్య చేయడానికి ఉపయోగించిన కత్తులను కూడా స్వాధీన పరుచుకున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది