ఎర్ర బెండ: ఈ రోజుల్లో జీవనశైలి వ్యాధుల సంఖ్య పెరిగిపోతున్నది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా చాలామంది మధుమేహం, అధికరక్తపోటు, అధిక కొలెస్టరాల్ లాంటి వ్యాధుల బారినపడుతున్నారు. రెండు పదుల వయసులో కూడా గుండెపోట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతోపాటు, కాస్త ఖర్చు ఎక్కువైనా ఆరోగ్యానికి మేలుచేసే ఆహార పదార్థాలనే మన మెనూలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాలోనివే పై ఫొటోలో కనిపిస్తున్న ఎర్ర బెండకాయలు. అయితే ఈ బెండకాయలు చాలా పిరం. సాధారణ ఆకుపచ్చ బెండకాయల ధర కిలో రూ.50 నుంచి రూ.80 వరకు ఉంటే.. ఈ ప్రత్యేకమైన ఎర్ర బెండకాయల ధర గరిష్టంగా కిలో రూ.800 వరకు ఉంటుందట. అంటే ఒక కిలో మటన్ ధర కంటే కిలో ఎర్ర బెండకాయల ధరే ఎక్కువన్నమాట. మరి ఈ బెండకాయలకు ఇంత ఎక్కువ ధర ఎందుకు అంటే.. వాటిలోని పోషక లక్షణాలే అందుకు కారణమని చెబుతున్నారు నిపుణులు.
ప్రస్తుతం దేశంలో ఈ ఎర్రబెండకాయలను చాలా తక్కువ మంది రైతులు సాగుచేస్తున్నారు. వారిలో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లాలోని ఖజూరి కలాన్ ఏరియాకు చెందిన మిస్రీలాల్ రాజ్‌పుత్ కూడా ఒకరు. ఎర్ర బెండకాయల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నదని, అయితే ఖర్చుకు తగినట్టే లాభాలు కూడా ఉంటాయని మిస్రీలాల్ రాజ్‌పుత్ చెబుతున్నాడు. ఆకుపచ్చ రంగులో ఉండే సాధారణ బెండకాయల్లో కంటే ఈ బెండకాయల్లో పోషక గుణాలు ఎక్కువగా ఉంటాయని అందుకే వీటి ధర ఎక్కువగా ఉంటుందని చెప్పాడు.
అంతేగాక తాను పండిస్తున్న ఎర్ర బెండకాయల్లో పోషకాలేగాక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయని రైతు మిస్రీలాల్ రాజ్‌పుత్ తెలిపాడు. హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవారికి, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి, మధుమేహంతో సతమతమవుతున్న వారికి, అధిక కొలెస్టరాల్‌ను తగ్గించుకునేందుకు ఆరాటపడుతున్నవారికి ఈ ఎరుపు బెండకాయలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మిస్రీలాల్ వివరించాడు.
ఈ ఎర్ర బెండకాయల సాగు గురించి ప్రశ్నించగా.. నేను వారణాసిలోని వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి కిలో ఎర్ర బెండ విత్తనాలు కొనుగోలు చేసి తెచ్చానని, గత జూలై మొదటి వారంలో ఆ విత్తనాలను నా చెలకలో విత్తానని మిస్రీలాల్ చెప్పాడు. విత్తన తర్వాత దాదాపు 40 రోజులకు పంట చేతికి రావడం మొదలైందని తెలిపాడు. ఈ బెండ సాగు కోసం తాను ఎలాంటి హానికర రసాయన ఎరువులను వాడలేదని మిస్రీలాల్ వెల్లడించాడు.
ఒక ఎకరం విస్తీర్ణంలో ఎర్ర బెండ సాగుచేస్తే కనిష్టంగా ఎకరానికి 40-50 క్వింటాళ్లు, గరిష్టంగా 70-80 క్వింటాళ్ల పంట చేతికి వస్తుందని మిస్రీలాల్ రాజ్‌పుత్ తెలిపాడు. ఆరోగ్యానికి మేలు చేసే పోషక గుణాలు మెండుగా ఉన్నందున సాధారణ బెండ కాయలతో పోల్చితే ఈ ప్రత్యేకమైన బెండకాయల ధర కిలో 7 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నాడు. అర కిలో ఎర్ర బెండకాయలను కొన్ని మాల్స్‌లో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారని తెలిపాడు. అంటే గరిష్టంగా కిలో ఎర్ర బెండ ధర రూ.800 పలుకుతున్నది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.