ఎర్ర‌ బెండ‌: ఈ బెండ‌కాయ‌లు మ‌ట‌న్ కంటే పిరం.. ఒక్క కిలో ధ‌ర ఎంతంటే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఎర్ర‌ బెండ‌: ఈ బెండ‌కాయ‌లు మ‌ట‌న్ కంటే పిరం.. ఒక్క కిలో ధ‌ర ఎంతంటే..

ఎర్ర‌ బెండ‌: ఈ రోజుల్లో జీవ‌న‌శైలి వ్యాధుల సంఖ్య పెరిగిపోతున్న‌ది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా చాలామంది మ‌ధుమేహం, అధిక‌ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట‌రాల్ లాంటి వ్యాధుల బారినప‌డుతున్నారు. రెండు ప‌దుల వ‌య‌సులో కూడా గుండెపోట్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌నం ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ముఖ్యంగా ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు చేసుకోవ‌డంతోపాటు, కాస్త ఖ‌ర్చు ఎక్కువైనా ఆరోగ్యానికి మేలుచేసే ఆహార ప‌దార్థాల‌నే మ‌న మెనూలో చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అలాంటి ఆరోగ్యక‌ర‌మైన […]

 Authored By nagaraju | The Telugu News | Updated on :7 September 2021,8:56 am

ఎర్ర‌ బెండ‌: ఈ రోజుల్లో జీవ‌న‌శైలి వ్యాధుల సంఖ్య పెరిగిపోతున్న‌ది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా చాలామంది మ‌ధుమేహం, అధిక‌ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట‌రాల్ లాంటి వ్యాధుల బారినప‌డుతున్నారు. రెండు ప‌దుల వ‌య‌సులో కూడా గుండెపోట్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌నం ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ముఖ్యంగా ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు చేసుకోవ‌డంతోపాటు, కాస్త ఖ‌ర్చు ఎక్కువైనా ఆరోగ్యానికి మేలుచేసే ఆహార ప‌దార్థాల‌నే మ‌న మెనూలో చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

అలాంటి ఆరోగ్యక‌ర‌మైన ఆహార ప‌దార్థాల జాబితాలోనివే పై ఫొటోలో క‌నిపిస్తున్న ఎర్ర బెండ‌కాయ‌లు. అయితే ఈ బెండ‌కాయ‌లు చాలా పిరం. సాధార‌ణ ఆకుప‌చ్చ‌ బెండ‌కాయ‌ల ధ‌ర కిలో రూ.50 నుంచి రూ.80 వ‌ర‌కు ఉంటే.. ఈ ప్ర‌త్యేక‌మైన ఎర్ర బెండ‌కాయ‌ల ధ‌ర గ‌రిష్టంగా కిలో రూ.800 వ‌ర‌కు ఉంటుందట‌. అంటే ఒక కిలో మ‌ట‌న్ ధ‌ర కంటే కిలో ఎర్ర బెండ‌కాయ‌ల ధ‌రే ఎక్కువ‌న్న‌మాట‌. మ‌రి ఈ బెండ‌కాయ‌ల‌కు ఇంత ఎక్కువ ధ‌ర ఎందుకు అంటే.. వాటిలోని పోష‌క ల‌క్ష‌ణాలే అందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు నిపుణులు.

ఎర్ర‌ బెండ‌: దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు మంచి ఔష‌ధం

ప్ర‌స్తుతం దేశంలో ఈ ఎర్ర‌బెండ‌కాయ‌ల‌ను చాలా త‌క్కువ మంది రైతులు సాగుచేస్తున్నారు. వారిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లాలోని ఖ‌జూరి క‌లాన్ ఏరియాకు చెందిన‌ మిస్రీలాల్ రాజ్‌పుత్ కూడా ఒక‌రు. ఎర్ర బెండ‌కాయ‌ల సాగు చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ద‌ని, అయితే ఖ‌ర్చుకు త‌గిన‌ట్టే లాభాలు కూడా ఉంటాయ‌ని మిస్రీలాల్ రాజ్‌పుత్ చెబుతున్నాడు. ఆకుప‌చ్చ రంగులో ఉండే సాధార‌ణ బెండ‌కాయ‌ల్లో కంటే ఈ బెండ‌కాయ‌ల్లో పోష‌క గుణాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అందుకే వీటి ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పాడు.

Mishri Lal is getting 'silver' by growing red ladyfinger, 300 to 400 rupees per kg - Daily India

అంతేగాక తాను పండిస్తున్న ఎర్ర బెండ‌కాయ‌ల్లో పోష‌కాలేగాక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఎక్కువగా ఉన్నాయ‌ని రైతు మిస్రీలాల్ రాజ్‌పుత్ తెలిపాడు. హృద‌య సంబంధ వ్యాధులు ఉన్న‌వారికి, ర‌క్త‌పోటు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారికి, మ‌ధుమేహంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారికి, అధిక కొలెస్టరాల్‌ను త‌గ్గించుకునేందుకు ఆరాట‌ప‌డుతున్న‌వారికి ఈ ఎరుపు బెండ‌కాయ‌లు చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయని మిస్రీలాల్ వివ‌రించాడు.

ఎర్ర‌ బెండ‌: ఎక‌రానికి 80 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబ‌డి

ఈ ఎర్ర‌ బెండ‌కాయ‌ల‌ సాగు గురించి ప్ర‌శ్నించ‌గా.. నేను వార‌ణాసిలోని వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ నుంచి కిలో ఎర్ర బెండ విత్త‌నాలు కొనుగోలు చేసి తెచ్చానని, గ‌త జూలై మొద‌టి వారంలో ఆ విత్త‌నాల‌ను నా చెలక‌లో విత్తానని మిస్రీలాల్ చెప్పాడు. విత్త‌న త‌ర్వాత దాదాపు 40 రోజులకు పంట చేతికి రావ‌డం మొద‌లైంద‌ని తెలిపాడు. ఈ బెండ సాగు కోసం తాను ఎలాంటి హానిక‌ర ర‌సాయ‌న ఎరువుల‌ను వాడ‌లేద‌ని మిస్రీలాల్ వెల్ల‌డించాడు.

ఒక ఎక‌రం విస్తీర్ణంలో ఎర్ర బెండ సాగుచేస్తే క‌నిష్టంగా ఎక‌రానికి 40-50 క్వింటాళ్లు, గ‌రిష్టంగా 70-80 క్వింటాళ్ల పంట చేతికి వ‌స్తుంద‌ని మిస్రీలాల్ రాజ్‌పుత్ తెలిపాడు. ఆరోగ్యానికి మేలు చేసే పోష‌క గుణాలు మెండుగా ఉన్నందున సాధార‌ణ బెండ కాయ‌ల‌తో పోల్చితే ఈ ప్ర‌త్యేక‌మైన బెండ‌కాయ‌ల ధ‌ర కిలో 7 నుంచి 8 రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌న్నాడు. అర కిలో ఎర్ర‌ బెండ‌కాయ‌ల‌ను కొన్ని మాల్స్‌లో రూ.300 నుంచి రూ.400 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నార‌ని తెలిపాడు. అంటే గ‌రిష్టంగా కిలో ఎర్ర బెండ ధ‌ర‌ రూ.800 ప‌లుకుతున్న‌ది.

nagaraju

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది