ఒడిశా కూలీల మృతుల కుటుంబాలకు సిఎం ఆర్థిక సాయం

గుంటూరు/ రేపల్లి: బ‌తుకు దెరువు కోసం వ‌డిశా నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్‌కు వ‌చ్చి లంకెవానిదిబ్బ అగ్ని ప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెందారు. వారిపై మాన‌వ‌తా దృక్ప‌థంతో ఒక్కొక్క కుటుంబానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున రూ. 3 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం అంద‌జేయాల‌ని ఆదేశించారు. రొయ్య‌ల చెరువుల యాజ‌మాన్యం కూడా త‌గిన ప‌రిహారం అందించేలా చూడాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
lankavani-dibba-fire-accident
lankavani-dibba-fire-accident

ఆ న‌గ‌దు మొత్తాన్ని చెక్కుల రూపంలో రాజ్యస‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణా రావు, క‌లెక్ట‌ర్ వివేక్ యాద‌వ్ మృతుల కుటుంబాల‌కు అందించారు. ఆక్వా యాజ‌మాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఆ సంస్థ య‌జ‌మాని అందించారు.

Advertisement

ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం కూడా ఒక్కో కుటుంబానికి రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్ర‌మానికి ఒడిశాలోని గోన్పూర్ నియోజిక‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘునాథ్‌, గుమెంగో, ఒడిశా విద్యార్థి నాయ‌కుడు బి. విష్ణుప్ర‌సాద్ పండా , ఆంధ్ర ప్ర‌దేశ్ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement