
lata mangeshkar never got married due to affair
Lata Mangeshkar:సినీ సంగీత రంగంపై తనదైన ముద్ర వేసుకున్న లతా మంగేష్కర్ ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలసిందే. కోట్లాది అభిమానుల సంగీత దేవతగా ఆమె ఆరాధించబడ్డ లతా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచింది. లతా మంగేష్కర్ వ్యక్తిగత జీవితం అసంపూర్ణం. డబ్బు, హోదా, కీర్తి, ఆనందం లతాజీ సొంతం. అయినప్పటికీ ఆమె వివాహం ఎందుకు చేసుకోలేదనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.. ఏడు దశాబ్దాలకుపైగా ఎన్నో వేల గీతాలతో ప్రేక్షకులను మైమరిపించారనే వార్త అభిమానులను, సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆమె అవివాహితగానే మిగిలిపోవడం వెనుక కారణాలేమిటనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న లతా మంగేష్కర్ పెళ్లిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
జీవితంలో ప్రతిదీ దేవుడు నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏది జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా ఆన్సర్ మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు. అయితే భూపేన్ హాజరికాతో అఫైర్ వ్యవహారం 2012లో మరోసారి తెరపైకి వచ్చింది. భూపేన్ హజారికా మరణం తర్వాత ఆయన మాజీ భార్య ప్రియంవద పటేల్ హజారికా మీడియాలో స్పందించడం చర్చనీయాంశమైంది.భూపేన్‌తో లతాకు అఫైర్ ఉందనే విషయాన్ని ఆమె నిర్ధారించారు. అలా వారి మధ్య అఫైర్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
lata mangeshkar never got married due to affair
జీవితంలో చాలా బిజీగా ఉండడంతో పాటు జీవితంలో కొన్ని చేదు అనుభవాలు పెళ్లివైపు దృష్టి పడనీయకుండా చేశాయనే విషయాన్ని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు. అలా లతా మంగేష్కర్ జీవితాంతం బ్రహ్మాచారిణిగా, అవివాహితగా మిగిలిపోయారు. తన జీవితాన్ని సంగీతానికి అంకితం చేసి.. సూర్యుడు అస్తమించని సంగీత సమ్రాజ్యానికి మహారాణిగా మారిపోయారు. కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం వలన అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంగా కుదరలేదు, అని లతా మంగేష్కర్ తెలిపారు. లతా మంగేష్కర్ 13ఏళ్ల వయసులో తండ్రి మరణించారు. దీనితో కుటుంబ పోషణ బాధ్యత లతాజీ తీసుకున్నారు . అతి చిన్న ప్రాయంలో ఆమె కెరీర్ మొదలుపెట్టారు.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.