Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఏర్పాట్లు .. త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో, ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలు చివరిదశకు చేరుకున్నాయి. ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న బీసీలకు రిజర్వేషన్ల అంశంలో నూతన నిర్ణయం తీసుకుంది.

#image_title
సమయం లేదు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. సెప్టెంబర్ 26న రాత్రి కల్లా సంబంధిత జీవోను జిల్లా కలెక్టర్లకు పంపించాలని యోచన.
అదే తేదీ తర్వాత, సెప్టెంబర్ 27న కలెక్టర్లు రాజకీయ పార్టీలతో సమావేశమై రిజర్వేషన్ల జాబితాను పబ్లిక్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 28వ తేదీన రిజర్వేషన్ల గెజిట్‌ను ప్రచురించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసే అవకాశముంది. అనంతరం 29న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే, రిజర్వేషన్ల గెజిట్ విడుదల అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.