Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :26 August 2025,4:00 pm

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు, భక్తుల సందడి, దేవుడిపై చూపే భక్తి విరాజిల్లుతున్నాయి. అయితే, ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పామిడిలో ఏర్పాటు చేసిన ఓ వినూత్న గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ విగ్రహ ప్రత్యేకతేంటంటే, పూర్తిగా సబ్బులు, షాంపూ ప్యాకెట్లతో రూపొందించడం.

#image_title

సాంప్రదాయ మట్టి విగ్రహాలకంటే భిన్నంగా, భక్తిని కాస్త సృజనాత్మకంగా చాటుకునే ప్రయత్నం చేశారు నిర్వాహకులు.విగ్రహ నిర్మాణంలో వినియోగించిన ప్రత్యేక వస్తువులు చూస్తే..

శరీరం: సంతూర్ సబ్బులు

చెవులు: లక్స్ సబ్బులు

కాళ్లు: సింతాల్ సబ్బులు

దంతాలు: మీరా షాంపూ ప్యాకెట్లు

హారాలు & అలంకరణ: సన్‌సిల్క్, కార్తీక షాంపూలు, కంఫర్ట్ ప్యాకెట్లు

ఈ వినూత్న గణపతి విగ్రహం తయారీకి సుమారు రూ. 25,000 ఖర్చయ్యిందని నిర్వాహకులు తెలిపారు. భక్తి మునిగిపోయే ఈ పండుగలో, ఇలా ప్రత్యేకంగా రూపొందించిన విగ్రహం పామిడిలో అందరి దృష్టిని సంతరించుకుంటోంది.స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సబ్బుల గణనాథుడిని దర్శించుకుంటూ, ఫోటోలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా పామిడిలో సబ్బులు, షాంపూలతో ఏర్పాటు చేసిన గణేశుడి ప్రతిమ అందరిని ఆకట్టుకుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది