Lord Vinayaka Wives : వినాయకుడి ఐదుగురు భార్యల గురించి మీకు తెలియని నిజాలు ఇవే
Lord Vinayaka Wives : ఇవాళ వినాయక చవితి. వినాయక చవితి అంటేనే ప్రత్యేకమైన రోజు. అన్ని విఘ్నాలను తొలగించే వినాయకుడు, తొలి పూజలు అందుకునే దేవుడు. గణేశుడి ఆహార్యం కూడా అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. వినాయకుడి తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరుడు అని తెలుసు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒకరు సిద్ధి, మరొకరు బుద్ధి. వీళ్లే కాదు. ఆయనకు పెద్ద కుటుంబం ఉందట. చాలా తక్కువ మందికే ఈ విషయాలు తెలుసు. ఈరోజు మనం గణేశ్ కుటుంబం గురించి తెలుసుకుందాం.
తొలి పూజలు అందుకునే గణేశుడికి చెందిన ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ.. ఆయన కుటుంబం మొత్తానికి ఒక ఆలయం ఉంది. గుజరాత్ లోని వనస్కాంత జిల్లాలో అంబాజీ ఆలయం ఉంది. అది సకుటుంబ సిద్ధి వినాయక ఆలయం అది. ఇది పురాతన ఆలయం. ఇక్కడ గణేశ్ తన మొత్తం కుటుంబంతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. వినాయకుడి కుటుంబం పూజించబడే ఏకైక ఆలయం ఇది.
Lord Vinayaka Wives : గణేశ్ కు ఐదు పెళ్లిళ్లు అయ్యాయా?
అయితే.. గణేశ్ ఆకృతి గురించి అందరికీ తెలుసు. అందుకే ఆయనకు వివాహం కాలేదు. ఏ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. తనకు పెళ్లి కానప్పుడు వేరే ఎవ్వరికీ కాకూడదని దేవతల పెళ్లిళ్లను డిస్టర్బ్ చేసేవాడు. తన మూషికం ద్వారా పెళ్లిళ్లు చెడగొట్టేవాడు. ఈ విషయం దేవతలకు తెలిసి బ్రహ్మదేవుడికి మొర పెట్టుకోవడంతో అప్పుడు బ్రహ్మ తన ఇద్దరు కుమార్తెలు సిద్ధి మరియు బుద్ధిని గణేశుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. గణేశ్ భార్యలు ఏకదంతుడికి ఇద్దరే అని అనుకుంటాం. కానీ.. ఆయనకు మరో ముగ్గురు భార్యలు కూడా ఉన్నారు. తుష్టి, పుష్టి, శ్రీ. గణేశ్ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయనకు మనవళ్లు కూడా ఉన్నారు.