
A girl who married a streetwalker
Love Story : సంవత్సరాలు.. తరాలు గడిచే కొద్దీ నిజమైన ప్రేమ కరువైపోతుంది. భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య అయినా సరే చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితులు మనిషిని నమ్మటానికి అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇక యువత విషయానికొస్తే అంతరంగిక సౌందర్యం కంటే బాహ్య సౌందర్యానికి ఎక్కువ ఇష్టపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐదు నిమిషాల సుఖాల కోసం బాహ్య సౌందర్యానికి ఆకర్షించబడి ఎవరికి వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. పెళ్లి కాకుండానే ప్రేమ పేరుతో.. మరి దారుణమైన పనులకు ఒడిగడుతున్నారు. ఇటువంటి రోజులలో ఒక అద్భుతమైన ప్రేమ కథ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలతో వైరల్ అవ్వుతోంది. పూర్తి విషయంలోకి వెళ్తే ఆమె పేరు సెర్నా..
అతని పేరు జువాన్. వీళ్ళిద్దరి ప్రేమ కథ 2009లో స్టార్ట్ అయింది. మెక్సికోకి చెందిన జువాన్… ఒక షోరూమ్ లో… కార్ వాష్ చేసే అబ్బాయి. సరిగ్గా అదే షోరూంకి 2009లో సెర్నాని రావటం జరిగింది. మొదటి చూపులోనే అతని ప్రేమలో పడిపోయింది. జువాన్ కుటుంబ నేపథ్యం చూస్తే అతడు నిరాశ్రయుడు. కార్ లు తుడుచుకుంటూ వచ్చిన డబ్బుతో ఏరోజుకారోజు బతికే కూలి జీవితం. చింపిరి జుట్టుతో పాటు మాసిన బట్టలతో వీధులలో తిరుగుతూ… రోడ్లు పైనే నిద్రపోయేవాడు. జువాన్ వ్యక్తిత్వ పరంగా చాలా మంచివాడు. ఎదుట వ్యక్తులతో చాలా మర్యాదగా మాట్లాడుతూ తన మంచితనంతో అందరితో కలిసి పోయేవాడు. జువాన్ లో ఉన్న ఈ గుణమే సెర్నాని ఆకట్టుకుంది. దీంతో తొలిచూపులోనే అతని ప్రేమలో పడిపోయింది.
Love Story A girl who married a streetwalker
సెర్నాని… తన ప్రేమని జువాన్ కి వ్యక్తపరిచాక మొట్టమొదట తన ప్రియుడు హెయిర్ కట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత జువాన్…లుక్ పూర్తిగా మారిపోయి ఒక మోడల్ హీరోలా అయిపోయాడు. దాదాపు వీరిద్దరి ప్రేమ రెండు సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి సెర్నాని జువాన్ పెళ్లి జీవితంలో ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ పదిఏళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టడం జరిగింది. ఈ క్రమంలో జువాన్ తన కుటుంబాన్ని పోషించడం కోసం తాపీ పనితో పాటు ఖాళీ సమయంలో మొబైల్ ఫోన్ లు రిపేరు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
సెర్నాని తన అందమైన ప్రేమకథను సోషల్ మీడియా ద్వారా ఫోటోల రూపంలో తెలియజేస్తూ అందరి అభిమానాన్ని సంపాదిస్తుంది. దీంతో నేటిజెన్లు ఆమె నిజమైన ప్రేమకు చేతులెత్తి మొక్కుతూ హ్యాట్సాఫ్ చెబుతూ… ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తన ఫస్ట్ నైట్ రోజు… ప్రియుడు జువాన్.. తాను అనాధ కాకముందు ఎంతో గొప్పదనవంతుడని బంధువులు మోసం చేయబట్టి కుటుంబం ఇష్టానుసారంగా జీవించబట్టి తన జీవితం రోడ్డుపాలయిందని చెప్పడట. ఈ రకంగా తన గతాన్ని చెప్పి పెళ్లి చేసుకున్న…సెర్నాకి ఫ్యుజ్ లు ఎగిరిపోయినట్టు నెటిజన్ లతో పంచుకుంది. ప్రస్తుతం వీరిద్దరి లవ్ స్టోరీ వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియాలో.. విపరీతంగా వైరల్ అవుతుంది.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.