
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 26 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 825 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య, అనసూయ ఇద్దరు కూడా ఫన్ కావాలనడంతో సామీ సామీ అంటూ పాట పెట్టి ఫుల్లుగా డ్యాన్స్ చేస్తారు. ఎక్కువ సౌండ్ పెట్టడంతో లాస్యకు చిరాకు వచ్చి అందరూ డ్యాన్స్ చేస్తుండగా కోపం వచ్చి సౌండ్ ఆపేస్తుంది. దీంతో దివ్యకు కోపం వస్తుంది. లాస్యతో గొడవ పడుతుంది. ఇంతలో నందు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో లాస్య సీన్ మొత్తం రివర్స్ చేసి తన వైపునకు తిప్పుకొని దివ్య మీద, పరందామయ్య, అనసూయ మీద చెబుతుంది. దీంతో పరందామయ్య, అనసూయపై చిరాకు పడతాడు నందు. అసలే నేను చిరాకులో ఉన్నాను ఇంటిని కాస్త ప్రశాంతంగా ఉండనీయండి ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.
నన్ను పట్టుకొని మా డాడ్ సెకండ్ వైఫ్ అని పరిచయం చేస్తావా? కుదిరిందా రోగం అని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. మరోవైపు తులసి, సామ్రాట్ ఇద్దరూ కారులో వెళ్తుంటారు. అలసిపోయారా అంటే లేదు ఆలోచిస్తున్నా అంటాడు సామ్రాట్. దేని గురించి అంటే నా గురించే అంటాడు సామ్రాట్. అయితే సరే అంటుంది తులసి. అదేంటండి.. నా గురించి అయితే దేని గురించి అని అడగరా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో సరే.. అయితే దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది తులసి. దీంతో మీలో నచ్చింది ఇదే. మీ దగ్గర్నుంచి చాలా మాట్లాడటం నేర్చుకోవాలి అని అంటాడు. అవిటితనంతో బతకడం అనేది గొప్ప. కళ్లకు గంతలు కట్టుకొని రెండు నిమిషాల పాటు కుదురుగా ఉండలేకపోయాను. ఏమీ చేయలేకపోయాను. అటువంటి పరిస్థితిలో నూరేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు. ఇన్నాళ్లు నేను ఎలా బతకాలో మాత్రమే నేర్చుకున్నాను. మీతో పరిచయం అయ్యాక.. బతుకు అంటే ఏంటో తెలుసుకున్నాను అంటాడు సామ్రాట్.
మరోవైపు దివ్య డిప్రెషన్ లో ఉండటంతో.. అందరూ వెళ్లి తనను ఓదార్చుతారు. ఇంతలో అభి, ప్రేమ్ వస్తారు. ఏమైంది అంటే.. నేను ఈ ఇంట్లో ఉండను. ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటుంది దివ్య. దీంతో ఏమైందో అసలు విషయం చెబుతుంది అంకిత.
బుద్ధిగా ఉంటుంది అనుకుంటే మళ్లీ ఇలా చేస్తుంది ఏంటి.. మరీ ఎక్కువ చేస్తుంది అన్నయ్య అంటాడు ప్రేమ్. దీంతో తప్పు నాది కూడా ఉంది. నేనే వచ్చి డ్యాన్స్ చేసి గోల చేయడమే తప్పు అయింది అంటాడు పరందామయ్య. డాడ్ లేడా అని అడుగుతాడు అభి.
దీంతో డాడ్ ఎందుకు లేడు. ఆయన కూడా ఆవిడకే సపోర్ట్ చేశారు అంటుంది దివ్య. దీంతో ఇంకా మనం ఊరుకోవడం ఎందుకు అంటాడు ప్రేమ్. దీంతో వాళ్లావిడకు సపోర్ట్ చేయకుండా నందు మాత్రం ఏం చేస్తాడు. వాడికే జాబ్ లేదనే టెన్షన్ లో ఉన్నాడు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో కూడా లేడు. కొంతకాలం ఎదురు చూద్దాం అని అంటాడు పరందామయ్య.
మరోవైపు దివ్య డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తుందో అని ఫోన్ చేస్తుంది దివ్య. మూడు నాలుగు సార్లు ఫోన్ చేసినా ఫోన్ చూసుకోదు దివ్య. ఇంతలో మామ్ ఫోన్ చేస్తుందని.. గొడవ మామ్ కు తెలియకూడదని అనుకుంటుంది. నీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కడిదాకా వచ్చింది అని అడుగుతుంది తులసి.
దీంతో దివ్య ఏం మాట్లాడదు. నువ్వు ఇక్కడ లేకపోతే బాగలేదు మామ్ అంటుంది దివ్య. ఏమైంది అంటే.. ఏం లేదు దిగులుగా ఉంది. బాధగా ఉంది అంటుంది దివ్య. నాకు కన్నతల్లి ఉండి కూడా అనాథగా బతుకుతున్నట్టు ఉంది మామ్. నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటున్నావో కానీ.. అందరి మధ్య ఉండి కూడా నాకు ఒంటరిగా అనిపిస్తోంది అంటుంది దివ్య.
దీంతో తప్పమ్మా.. అలా ఏడవకూడదు. చిన్నప్పుడు నా దగ్గర పడుకో అంటే.. పడుకునే దానివి కాదు. వెళ్లి నీ నాన్న దగ్గర దూరేదానివి అంటుంది. దీంతో అందుకేనేమో ఆ దేవుడు నిన్ను దూరం చేశాడు అంటే.. లేదమ్మా నన్నే మీ అందరికీ దూరం చేశాడు అంటుంది తులసి.
కట్ చేస్తే తెల్లవారుతుంది. పరందామయ్యకు కడుపులో మంటగా ఉంటుంది. దీంతో అంకిత పాలు కాచి తీసుకురా అంటే.. వద్దులే అంటుంది అనసూయ. దీంతో శృతి దగ్గరికి వెళ్లి అడుగుతుంది అంకిత. దీంతో అక్కడ ఫ్రిడ్జ్ కు తాళం వేసి ఉండటం చూసి షాక్ అవుతుంది అంకిత.
దీంతో వెళ్లి ఫ్రిడ్జ్ కీ కావాలని లాస్యను అడుగుతుంది అంకిత. దీంతో ఇవ్వను అంటుంది. దీంతో అంకిత, శృతి ఇద్దరూ తనతో గొడవ పెట్టుకుంటారు. ఇంతలో శృతి స్పృహ తప్పిపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.