Saranga Dariya : రేలా రె రేలా షో నుంచి లవ్ స్టోరీ సినిమా సాంగ్ సారంగ దరియాను కాపీ చేశారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Saranga Dariya : రేలా రె రేలా షో నుంచి లవ్ స్టోరీ సినిమా సాంగ్ సారంగ దరియాను కాపీ చేశారా?

Saranga Dariya : దాని కుడీ భుజం మీద కడువా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగ దరియా.. అనే జానపద గేయం.. తెలంగాణలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. నిజానికి ఈ జానపద గేయాన్ని మొదటిసారి మాటీవీలో ప్రసారమయ్యే రేలా రె రేలా అనే జానపద షోలో పాడారు. అప్పటి నుంచి ఈ పాట పలు రూపాంతరాలు చేసుకొని.. ఎందరో గొంతుల నుంచి జాలు వారింది. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 March 2021,11:33 am

Saranga Dariya : దాని కుడీ భుజం మీద కడువా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగ దరియా.. అనే జానపద గేయం.. తెలంగాణలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. నిజానికి ఈ జానపద గేయాన్ని మొదటిసారి మాటీవీలో ప్రసారమయ్యే రేలా రె రేలా అనే జానపద షోలో పాడారు.

అప్పటి నుంచి ఈ పాట పలు రూపాంతరాలు చేసుకొని.. ఎందరో గొంతుల నుంచి జాలు వారింది. చాలామంది ఇదే పాటను మళ్లీ పాడి ఆ పాట ప్రాముఖ్యతను తెలంగాణ మొత్తం వినిపించారు. నిజానికి ఆ పాట లిరిక్స్ అద్భుతం. మొదటి సారి ఎవరు ఈ లిరిక్స్ రాశారో కానీ.. ఈ పాటను మళ్లీ ఇప్పుడు తెలుగులో వస్తున్న లవ్ స్టోరీ అనే సినిమాలో పాడారు.

ఈ పాటకు కొన్ని మెరుగులు దిద్ది.. సుద్దాల అశోక్ తేజ రచించారు. అయితే.. ఇప్పటికే ఈ పాట తెలంగాణలో ప్రాచుర్యంలో ఉండటం.. అందరి నోళ్లలో నానడంతో ఈ పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఎలాగూ ఈపాట ఇప్పటికే పలు సార్లు వివిధ రూపాల్లో రావడంతో.. లవ్ స్టోరీ సినిమాలోని ఈ పాటను వింటుంటే.. అచ్చు గుద్దినట్టు కాపీలాగానే అనిపిస్తుంది.

లవ్ స్టోరీ సినిమాలో ఈ పాటను మంగ్లీ పాడగా.. పవన్ సీహెచ్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది