love story song saranga dariya lyrics are same as rela re rela song
Saranga Dariya : దాని కుడీ భుజం మీద కడువా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదుర సెలియా.. దాని పేరే సారంగ దరియా.. అనే జానపద గేయం.. తెలంగాణలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. నిజానికి ఈ జానపద గేయాన్ని మొదటిసారి మాటీవీలో ప్రసారమయ్యే రేలా రె రేలా అనే జానపద షోలో పాడారు.
అప్పటి నుంచి ఈ పాట పలు రూపాంతరాలు చేసుకొని.. ఎందరో గొంతుల నుంచి జాలు వారింది. చాలామంది ఇదే పాటను మళ్లీ పాడి ఆ పాట ప్రాముఖ్యతను తెలంగాణ మొత్తం వినిపించారు. నిజానికి ఆ పాట లిరిక్స్ అద్భుతం. మొదటి సారి ఎవరు ఈ లిరిక్స్ రాశారో కానీ.. ఈ పాటను మళ్లీ ఇప్పుడు తెలుగులో వస్తున్న లవ్ స్టోరీ అనే సినిమాలో పాడారు.
ఈ పాటకు కొన్ని మెరుగులు దిద్ది.. సుద్దాల అశోక్ తేజ రచించారు. అయితే.. ఇప్పటికే ఈ పాట తెలంగాణలో ప్రాచుర్యంలో ఉండటం.. అందరి నోళ్లలో నానడంతో ఈ పాటను దర్శకుడు శేఖర్ కమ్ముల సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఎలాగూ ఈపాట ఇప్పటికే పలు సార్లు వివిధ రూపాల్లో రావడంతో.. లవ్ స్టోరీ సినిమాలోని ఈ పాటను వింటుంటే.. అచ్చు గుద్దినట్టు కాపీలాగానే అనిపిస్తుంది.
లవ్ స్టోరీ సినిమాలో ఈ పాటను మంగ్లీ పాడగా.. పవన్ సీహెచ్ ఈ పాటకు మ్యూజిక్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.